Poorna in Sundari Trailer: పూర్ణ న‌టిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ అప్‌కమింగ్ మూవీ సుంద‌రి ట్రైలర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. Sundari Trailer చూస్తోంటే... అందమైన పల్లెటూరి యువతిపై ఆమె చుట్టూ ఉండే వారే కన్నేయడం... ఆ యువతికి పెళ్లి అయిన తర్వాత కూడా ఇబ్బంది పెట్టే వారు ఒకవైపు... మరోవైపు ఆ యువతికి ఎదురయ్యే సమస్యల్ని చూసి భయంతో పారిపోయే భర్త కూడా ఆమెను ఇబ్బంది పెడితే ఆ యువతి జీవితం ఎలా ఉంటుందనే కథాంశానికి శాంపిల్ చూపించినట్టుగా ఉందనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Uppena Trailer : అంచనాలు పెంచిన ఉప్పెన ట్రైలర్


టీవీ సీరియల్ ఆర్టిస్ట్ Arjun Ambati ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప‌ల్లెటూరంటేనే అందం..అలాంటి అంద‌మైన ఊరిలో ఒక అంద‌మైన అమ్మాయి సుంద‌రి క‌థ అంటూ ఇంట్ర‌డ‌క్ష‌న్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొద‌లైంది. ఎప్పుడూ తన అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకునే Actress Poorna ఈ చిత్రంలో కూడా తన పాత్రకు న్యాయం చేసినట్టుందని Sundari Trailer చూసిన ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. త‌న‌పై Sexual assault కి పాల్పడి వారిపై సుంద‌రి ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంద‌నేది సుందరి మూవీ అసలు కథాంశం. ‌క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook