Suniel Shetty likely to play key role in Allu Arjun Movie Pushpa 2: 'బాహుబ‌లి' త‌ర్వాత పాన్ ఇండియా లెవల్లో ఆక‌ట్టుకున్న సినిమా 'పుష్ప‌: ది రైజ్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంను లెక్కల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గతేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన పుష్ప‌పెద్ద సెన్సేష‌న్‌ క్రియేట్ చేసింది. తెలుగులోనే కాకుండా విడుద‌లైన అన్ని భాష‌ల్లో రికార్డులు సృష్టించింది. సుకుమార్ టేకింగ్‌, బ‌న్నీ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప 2 కోసం మేకర్స్ ఓ బాలీవుడ్ స్టార్‌ని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. పుష్ప 2లో కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారట. పుష్పలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్‌కు పై అధికారికంగా ఆయన కన్పించబోతున్నారట. పార్ట్ 2లో సునీల్ శెట్టి పాత్ర అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. సునీల్ శెట్టి ఇటీవల విడుదల అయిన గని సినిమాలో కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. 


ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన పుష్ప సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టించారు. బన్నీ నటన, రష్మిక అందం, దేవిశ్రీ మ్యూజిక్, సుకుమార్ టేకింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ప్ర‌స్తుతం పార్ట్-2 ప‌నులు ప్రారంభ‌మైయ్యాయి. వీలైనంత త్వ‌రగా చిత్రాన్ని పూర్తిచేసి ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా చేయాలనీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Also Read: రషీద్ ఖాన్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్ కోచ్!


Also Read: Petrol: వాహనదారులకు బంపరాఫర్.. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా రూపాయికే లీటర్ పెట్రోల్... ఎక్కడంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.