Mahesh Babu: నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఆ రికార్డు ఒక్క మహేష్ బాబుకే సొంతం.. సూపర్ స్టారా.. మజాకా..
Mahesh Babu Non Pan India Record: తెలుగు స్టార్ హీరోల్లో ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క ప్యాన్ ఇండియా మూవీ చేయలేదు. కానీ ఈయనకు ప్యాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులున్నారు. త్వరలో చేయబోయే రాజమౌళి సినిమాతో ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్‌లో సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు పండుగాడు. ఈ నేపథ్యంలో నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఎవరిక సాధ్యం కానీ ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు మహేష్ బాబు.
Mahesh Babu Non Pan India Record: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇపుడు చేయబోయే రాజమౌళితో అసలు సిసలు ప్యాన్ ఇండియాతో పాటు ప్యాన్ వరల్డ్ అనిపించుకోవడం గ్యారంటీ అని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు అందరు ఆశిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. మహేష్ బాబు హీరోగా నటించి 'గుంటూరు కారం' సహా లాస్ట్ ఐదు చిత్రాల బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు షేర్ చూస్తే.. నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఈ రేంజ్ వసూళ్లు ఏ సౌత్ హీరోలకు దక్కలేదనే చెప్పాలి.
'గుంటూరు కారం': త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఫ్లాప్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 111.81 కోట్ల షేర్ రాబట్టింది. అంతకు ముందు సర్కారు వారి పాట:పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా మిక్స్‌డ్ టాక్‌తో కూ. 110.12 కోట్ల షేర్ రాబట్టింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సరిలేరు నీక్వెవరు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 138.78 కోట్ల షేర్ రాబట్టి అప్పటి సంక్రాంతి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. అటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 104.58 కోట్ల షేర్ రాబట్టి హిట్ అనిపించుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ రెండోసారి కలిసి పనిచేసిన చిత్రం 'భరత్ అను నేను'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 101 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా మహేష్ బాబు గత ఐదు చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ కలిపి రూ. 566.29 కోట్ల షేర్ వచ్చింది. ఒక రకంగా ఒక్క ప్యాన్ ఇండియా సినిమాలు కాకపోయినా.. ఈ రేంజ్‌లో షేర్ వసూళ్లు చేసిన హీరోగా నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో మహేష్ బాబు సరికొత్త రికార్డులకు ఎక్కారు.
Also Read: KCR Arrest: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook