Mahesh Babu Birthday trending: టాలీవుడ్‌లో సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) కు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో‘సరిలేరు నీకెవ్వరు’ అనాల్సిందే. అయితే.. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు  పుట్టినరోజును ఆయన అభిమానులు ఒక రేంజ్‌లో జరుపుకుంటున్నారన్న విషయాన్ని అభిమానులంతా ఇప్పుడు నిజం చేసి చూపించారు. తాజాగా మహేష్ బాబు 45వ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులంతా గత రికార్డులన్నింటినీ తుడిపేసారు. #HBDMaheshBabu హ్యాష్‌ట్యాగ్‌‌తో ట్విట్టర్‌లో ప్రభంజనాన్ని సృష్టించారు.  ఈ హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్వీట్ల సంఖ్య 33 మిలియన్లకు చేరువులో ఉంది. అయితే దీని సంఖ్య రాత్రి వరకు మరింత పెంచాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.  Also read: Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ సర్‌ప్రైజ్



ఇదిలాఉంటే.. మహేష్ జన్మదినం సందర్భంగా ‘స‌ర్కారు వారి పాట’ ( Sarkaru vaari paata ) మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టర్ కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో #HBDMaheshBabu హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ మహేష్ జన్మదినాన్ని మరింత స్పెషల్‌గా చేసుకుంటున్నారు.  Also read: Mahesh Babu: టాలీవుడ్ యువరాజుకు హ్యాపీ బర్త్ డే