Mahesh Babu Comments On Sreeleela Dance: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబో 14 ఏళ్ల తరువాత 'గుంటూరు కారం' (Guntur Karam) మూవీ కోసం చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి హిట్స్‌ తరువాత ఈ కాంబోలో మూవీ వస్తుండడంతో సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన గుంటూరు కారం ఈ నెల 12న థియటర్లలో సందడి చేయనుంది. శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్స్‌గా నటించారు.  మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌లో భారీస్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ (Guntur Karam Pre Release Event)ను నిర్వహించారు. ఈ వేడుకకు భారీస్థాయిలో అభిమానులు తరలిరాగా.. మహేష్ బాబు తన స్పీచ్‌తో అందరిలో జోష్‌ నింపాడు. 
 
గుంటూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ ఐడియా డైరెక్టర్ త్రివిక్రమ్‌దేనని చెప్పాడు సూపర్ స్టార్. త్రివిక్రమ్‌ తనకు స్నేహితుడు కంటే ఎక్కువని అన్నాడు. ఆయన గురించి ఎప్పుడు బయట మాట్లాడనని.. ఇంట్లో వాళ్ల గురించి బయట ఎక్కువ ఏం మాట్లాడతామన్నాడు. గత రెండేళ్లుగా ఆయన ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఈ సినిమాలో సరికొత్త మహేష్‌ బాబును చూడబోతున్నారని అన్నాడు. ఇందుకు కారణం త్రివిక్రమ్ అని అన్నాడు. తాను ఎప్పుడు ఇలా చెప్పలేదని.. తన మనసులో నుంచి ఈ మాటలు వస్తున్నాయన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం హీరోయిన్ శ్రీలీలపై మహేష్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ‘లీలా నీ గురించే మాట్లాడుతున్నా.. కంగారు పడకమ్మా..’ అంటూ స్టేజ్‌పై ఉన్న అందరినీ నవ్వించాడు. చాలా రోజుల తరువాత మన తెలుగు అమ్మాయి ఓ పెద్ద హీరోయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నాడు. హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరని ప్రశంసించాడు. శ్రీలీలకు షూటింగ్ స్పాట్‌లో చిత్రీరణ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుందని.. మేకప్ వ్యాన్‌లోకి వెళ్లదన్నాడు.  


ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం వామ్మో అంటూ మహేష్ బాబు నవ్వేశాడు. ‘వామ్మో అదేం డ్యాన్స్. హీరోలు అందరికీ తాట ఊడిపోయిద్ది. శ్రీలీల ఇలానే ఉండు. నీకు అద్భుతమైన భవిష్యత్ ఉంది.’ అంటూ అన్నాడు. మీనాక్షి ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిందని.. తాను, త్రివిక్రమ్ అడగగానే అసలేం ఆలోచించకుండా వెంటనే అంగీకరించిందని తెలిపాడు. థమన్ గురించి మాట్లాడుతూ.. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ చేస్తావా అని తాను, త్రివిక్రమ్ అడిగితే.. అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడని. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయితే పది డిస్కషన్లు పెట్టేవాళ్లన్నాడు. రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయన్నాడు.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook