Super star Rajinikanth mass dance in anant ambani Radhika merchant wedding: ప్రపంచ కుబేరుడు,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ కుమారుడి పెళ్లి వేడుక ముంబైలో ఎంతో గ్రాండ్ గా జరుతుంది. ఈ పెళ్లి వేడుకకు మన దేశంలోని క్రీడా, రాజకీయ, సినీ రంగాలకు చెందిన ఎంతో మంది వీఐపీలు హజరయ్యారు.  ఇక విదేశాల నుంచి కూడా అతిథులు అంబానీ కుటుంబం పెళ్లి వేడుక చూడటానికి తరలి వచ్చారు. ఈ క్రమంలో ముంబైలోని అనేక హోటళ్లు కూడా ఫుల్ అయిపోయాయి. చాలా హోటళ్లు కూడా ఈ పెళ్లి వేడుక పుణ్యామా.. అని రూమ్ ల చార్జీలు డబుల్, ట్రిబుల్ చేసేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరోవైపు నిన్న పెళ్లి వేడుక కార్యక్రమంలో (జులై 12) ఎంతో గ్రాండ్ గా జరిగింది. ముఖేష్ కుటుంబంతో పాటు, పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ముఖేష్ తన కొడుకు పెళ్లి చూసి పలుమార్లు ఎమోషనల్ కూడా అయ్యాడు. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు ముందే.. 50 మంది పేదలకు పెళ్లిళ్లు జరిపించాడు. అంతేకాకుండా.. వారికి భారీగా కానుకలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.  


ఇదిలా ఉండగా.. అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుక మాత్రం, చరిత్రలో గుర్తుండిపోయేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే అతిథుల కోసం ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు.. 3వేల రకాల వంటకాలు కూడా సిద్ధం చేశారంట. ఇదిలా ఉండగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ , అన్నిరంగాల నుంచి ఫెమస్ స్టార్టు పెళ్లి వేడుకకు హజరయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన పెళ్లి వేడుకలో మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో ట్రెండింగ్ లో నిలిచింది.


అనంత్ పెళ్లి వేడుకలో.. జాన్ సీనా, సల్మాన్​ ఖాన్, షారుక్ ఖాన్​ లాంటి స్టార్స్ తమ  మాస్ స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇంతలో అక్కడికి రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకేం హుషారుగా ఆయన కూడా ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్లు.. హుషారుగా స్టెప్పులు వేసి అక్కడున్న వారిని షాక్ కు గురిచేశారు. సాధారణంగా.. పెళ్లిళ్లలో.. యంగ్ నటీనటులు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ లు చేస్తుంటారు.   కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా తన స్టెప్పులతో అందరిని ఫిదా చేశారు.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..


కాగా,ఈ పెళ్లి వేడుకకు.. రజినీకాంత్ తన భార్య లత, కూతురు ఐశ్వర్య, మనవడితో కలిసి అటెండ్ అయ్యారు. రజినీకాంత్ .. చిన్న చిన్న స్టెప్పులతో అదరగొట్టేసారు. అక్కడున్న వారు కూడా రజినీ కాంత్ ను చప్పట్లతో, విజిల్స్ తో ఉత్సాహ పరిచారు.  రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలు చూసి సూపర్ స్టార్ అభిమానులు మాత్రం పడంగ చేసుకుంటున్నారు. తమ తలైవాకు ఇంకా.. వయసు కాలేదని మురిసిపోతున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి