Superstar Rajinikanth's Jailer first single Out: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జైలర్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి తన అందంతోపాటు డ్యాన్స్ తో కూడా మెస్మరైజ్ చేసింది. తలైవా కూడా తన స్టైల్ తో ఇరగదీశాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుంది.  అనిరుధ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. యూట్యూబ్ లో రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ పాటకు అరుణ్‌రాజా కామరాజ్ సాహిత్యం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రిలీజైన రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ మూవీపై అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. జైలర్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. జైసల్మేర్‌లో కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం జరిగిన సమయంలోనే సినిమా యొక్క కొంత భాగాన్ని కూడా అక్కడ చిత్రీకరించారు. ఈ మూవీని సన్ ఫిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్ సినిమాను ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూవీతో సూపర్ స్టార్ సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



Also Read: Project K Update: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ వేడుకలోనే 'ప్రాజెక్టు-కే' టైటిల్ రివీల్..


''రజినీ సార్ తో పనిచేయాలన్న నా కల నిజమైంది. జైలర్ సెట్‌లోని జ్ఞాపకాలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. తలైవా.. ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ఓ పుస్తకాన్ని బహుమతిగా తన సైన్ చేసి బహుమతిగా ఇచ్చారు. ఆ బుక్ చాలా ఆలోచనాత్మకంగా ఉంది'' అంటూ తమన్నా ఇటీవల చెప్పింది. 


Also Read: Shah Rukh Khan: రికార్డు ధరకు షారుఖ్ 'జవాన్' నాన్ థియేట్రికల్ రైట్స్.. బాలీవుడ్ చరిత్రలో ఇదే అత్యధికం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook