Rajinikanth health bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం అర్ధరాత్రి చెన్నైలోనే అపోలో ఆసుపత్రిలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ కుటుంబ సభ్యుల సహాయంతో చేరినట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని , మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారంటూ వార్తలు వైరల్ అవ్వగా.. తాజాగా అపోలో హాస్పిటల్స్ వైద్య బృందం రజనీకాంత్ ఆరోగ్యం పై ఒక బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ బులెటిన్ లో ఏముందనే విషయానికొస్తే.. 2024 సెప్టెంబర్ 30వ తేదీన గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్ లో రజనీకాంత్ చేరారు. గుండె నుండి రక్తాన్ని బయటకు సరఫరా చేసే ప్రధాన రక్తనాళం లో వాపు వచ్చింది. దీనికి కాత్ ల్యాబ్ లో ఎలక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ద్వారా వాపును తగ్గించాము. సీనియర్  కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్.. ప్రధాన రక్తనాళం లో స్టెంట్ వేసి వాపును పూర్తిగా మూసివేశారు.  ఒక ప్రణాళిక బద్ధంగానే ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు అంటూ అపోలో హాస్పిటల్స్ బృందం ఒక బులెటిన్ విడుదల చేసింది.ఈ బులెటిన్ ను చూసి అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే రజినీకాంత్ ఆరోగ్య విషయంపై ఇలా ప్రకటన విడుదల చేసి అభిమానులకు సంతోషాన్ని కలిగించారు వైద్య బృందం.


ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ కోలివుడ్ డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా కావడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి 
ఇకపోతే మరోవైపు కూలీ సినిమాలో కూడా నటిస్తూ ఉండగా.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.


Read more: Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.