Happy Birthday Rajinikanth: నేడు తలైవా రజనీకాంత్ పుట్టినరోజు-ట్విట్టర్‌లో పోటెత్తుతున్న విషెస్, మీమ్స్
Happy Birthday Rajinikanth: నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ పుట్టినరోజు. బస్సు కండక్టర్‌గా మొదలై ఇండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిదాయకం. సినిమాలే కాదు తన వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Happy Birthday Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 71వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఏడు పదుల వయసులోనూ ఆయన స్పీడ్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల విడుదలైన పెద్దన్న సినిమాలో రజనీ (Rajinikanth) నటన, జోరు చూస్తే ఆయనకు వయసైపోతుందంటే నమ్మశక్యం కాదు. రజనీ సినిమాలు చూస్తూ పెరిగినవాళ్లకు వయసైపోతుందేమో గానీ... 1990ల్లో రజనీకి, ఇప్పటి రజనీకి ఆన్‌స్క్రీన్ ఏమాత్రం తేడా లేదు. పైగా, దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నప్పటికీ కించిత్తు గర్వం లేకుండా నిరాడంబర జీవితాన్నే గడుపుతారు. అటు సామాజిక సేవలోనూ మిగతావాళ్ల కంటే ఎప్పుడూ ముందుంటారు. అందుకే తలైవా అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం... ఆయనో సూపర్ హ్యూమన్...
తలైవా పుట్టినరోజు (Thalaiva Rajinikanth Birthday) సందర్భంగా ట్విట్టర్‌లో ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ రజనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అదే సమయంలో పలువురు నెటిజన్లు రజనీపై సరికొత్త మీమ్స్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. రజనీ వ్యక్తిత్వాన్ని, స్టైల్‌ను, మొత్తంగా ఆయన గొప్పతనాన్ని మీమ్స్ ద్వారా వైరల్ చేస్తున్నారు.
'8 ఏళ్ల వయసులో రజనీ సినిమా చూస్తూ నేను... ఇప్పుడు 24 ఏళ్ల వయసులో రజనీ సినిమా చూస్తూ...' అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో మీమ్‌ను పోస్ట్ చేశారు. అందులో 90ల్లో రజనీ స్టైల్‌కు, ఇప్పటి రజనీ స్టైల్ ఏమాత్రం తగ్గలేదనే విషయం గమనించవచ్చు. ఇక మరో నెటిజన్... 'తలైవా నటనకు ఏ అవార్డులు అవసరం లేదు... ఆస్కార్‌లు సహా... కానీ ఏదో ఒకరోజు ఆ ఆస్కార్ అవార్డుకే రజనీకాంత్ (Superstar Rajinikanth)అవార్డు వస్తుంది.' అని రజనీపై అభిమానాన్ని చాటుకున్నాడు. మరో నెటిజన్ రజనీ సంపాదన గురించి చెప్పేలా ఓ మీమ్‌ను పోస్ట్ చేశారు. 'రజనీ ఒకసారి చెక్కు రాసిస్తే... ఏకంగా బ్యాంకే బౌన్స్ అయింది...' అని అందులో పేర్కొన్నాడు.