Rajinikanth: `జైలర్` రిలీజ్‌కి ముందే.. హిమాలయాలకు రజినీకాంత్..
Jailer Movie: రేపు `జైలర్` మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హిమాలయాలకు బయలుదేరారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి.
Superstar Rajinikanth in Himalayas: సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం 'జైలర్'(Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు అంటే ఆగస్టు 10న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రజనీకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన(Rajinikanth) ప్రతీ ఏటా మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళతారు. అక్కడి ప్రకృతి ఒడిలో కొద్ది రోజులు సేదతీరుతూ ధ్యానంలో నిమగ్నమవుతారు. తన సినిమాల రిలీజ్ కు ముందు ఎక్కువగా రజనీకాంత్ హిమాలయాలకు(Himalayas) వెళ్లడం అనవాయితీ. అయితే కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన హిమాలయ యాత్రకు వెళ్లలేదు. మళ్లీ ఇప్పడు వెళ్లారు.
ఈ సినిమాలో రజనీకి జోడిగా తమన్నా నటిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అనిరుధ్ సంగీతం అందించాడు. ఇందులో కావాలాయ్య సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మధురైకు చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగులకు ఉచితంగా మూవీ టికెట్స్ ను ఇవ్వనుంది. రజినీకాంత్ నుంచి రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో తలైవా ఫ్యాన్స్ మాంచి జోష్ లో ఉన్నారు.
Also Read: Alia Bhatt: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి తెలుగు నేర్పించిన ఆలియాభట్, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook