Jailer Collections: రూ.150 కోట్ల మార్క్ దిశగా రజనీ `జైలర్`.. నాలుగో రోజు ఎంతంటే?
Jailer Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ నయా మూవీ `జైలర్`. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ వసూళ్ల రూ.150 కోట్లకు చేరువలో ఉన్నాయి.
Jailer Collections Day 4: సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్'(Jailer Movie) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఆగస్టు 10న రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ మూవీ నాలుగో రోజూ కూడా వసూళ్లు బాగానే రాబట్టింది. దాదాపు రూ. 38 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 146 కోట్లు వసూలు చేసినట్లయింది. తొలి రోజు రూ.48.35 కోట్లు, రెండో రోజు రూ. 25. 75 కోట్లు, మూడో రోజు రూ.35 కోట్లు వచ్చాయి. రేపు ఇండిపెండెన్స్ డే కావడంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకి జోడిగా తమన్నా నటించింది. ఇందులో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, సీనియర్ నటి రమ్యకృష్ణ, జాకీష్రాప్, సునీల్ తదితరులు కీ రోల్స్ లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను రూపొందించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ మూవీ మాంచి బ్రేక్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి(Jailer ott release date) వస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. జైలర్ మూవీ డిజిటల్ రైట్ స్ ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని దసరా పండుగకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేందుకు రెడీ అవ్వండి.
Also Read: Devara Movie: దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు అత్తగా ఆ సీనియర్ హీరోయిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook