Suriya's Suriya 42 Motion Poster Released: సూర్య.. సినీ ప్రియులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా మారాడు. తమిళ హీరోనే అయినా.. తెలుగులో కూడా సూర్యకు భారీ డిమాండ్ ఉంది. 'నెరుక్కు నేర్' సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సూర్య.. శివపుత్రుడు చిత్రంతో పాపులర్ అయ్యాడు. 2005లో వచ్చిన గజిని సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. సూర్య సన్నాఫ్ కృష్ణన్, యముడు, సెవెంత్ సెన్స్, 24, యముడు 2, యముడు 3తో స్టార్ అయ్యాడు. ఆకాశం నీ హద్దురా, జై భీం సినిమాలలో నట విశ్వరూపం చూపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూర్య.. ప్రస్తుతం 'సూర్య 42' పేరుతొ ఓ సినిమా చేస్తున్నాడు. చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీకృష్ణ, ప్రమోద్‌ స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సూర్య 42 చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది.



ప్రస్తుతం సూర్య 42 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఒక నిమిషం 31 సెకండ్ల నిడివి గల ఈ వీడియో.. ఓ గద్ద ఆకాశం నుంచి కిందకు రావడంతో మొదలవుతుంది. ఆ గద్ద తిరిగి తిరిగి యుద్ధం జరిగే స్థలానికి చేరుకొని.. సూర్య భుజంపై వాలుతుంది. పోరాట వీరుడుగా సూర్య కనిపిస్తున్న ఈ మోషన్‌ పోస్టర్‌.. అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మోషన్‌ పోస్టర్‌ వీడియోలో వెల్లడించారు. వీరం, విశ్వాసం, వివేకం, పెద్దన్న సినిమాలు తీసిన శివ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: రాహుల్‌ ద్రవిడ్‌ హనీమూన్‌ కాలం ముగిసింది.. భారత మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: నేనే పాకిస్తాన్ కెప్టెన్‌ని.. రిజ్వాన్‌ కాదు! అంపైర్‌పై ఫైర్ అయిన బాబర్ అజామ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి