Suriya - kanguva: 'కంగువా' సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా భారీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ  బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ విడుదల కాబోతుంది. ఓన్లీ తెలుగులో కాదు పలు ఇంటర్నేషనల్‌ లాంగ్వేజ్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగాహీరో సూర్య మాట్లాడుతూ -


ఓ గొప్ప మూవీలో నటించే అవకాశం కొన్నిసార్లు మాత్రమే దక్కుతోంది. అదృష్టవశాత్తు ఆ అవకాశం కంగువాతో దక్కింది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగిందని అనుకుంటాను. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత భారీ బిగ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా మారింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు చెబుతున్నాను.  అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కృషితో ఈ సినిమా బాగా వచ్చింది. ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్ పోయాం. ఔట్‌పుట్ ఎంతో బాగా వచ్చింది. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత  కాదు. కంగువకు  150 రోజులకు పైగా పనిచేసాను.  ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. ప్రేక్షకులకు కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు.


నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
 
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ


Also Read:  మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి