Communal Symbol controversy in Jai Bhim movie: సూర్య హీరోగా నటించిన జై భీమ్ మూవీపై మరో వివాదం రాజుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న జై భీమ్ మూవీ వివాదాలతోనూ అంతే సమానంగా లైమ్‌లైట్‌లో నిలిచింది. తొలుత జై భీమ్ సినిమాతో హిందీ భాషపై ధ్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఓ వివాదం రాజుకోగా.. తాజాగా సినిమాలోని ఓ సన్నివేశంలో బ్యాగ్రౌండ్‌లో ఓ వర్గానికి చెందిన చిహ్నాన్ని (Communal Symbol in Jai Bhim movie) చూపించారంటూ మరో కొత్త వివాదం తలెత్తింది. దీంతో ఒక వర్గానికి చెందిన ఆడియెన్స్ జై భీమ్ మూవీ యూనిట్ సభ్యులపై మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆడియెన్స్ అభ్యంతరాలను పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్న జై భీమ్ మూవీ నిర్మాతలు.. తాజాగా డిజిటల్ మోడ్‌లోనే ఆ సన్నివేశంలోని బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్న చిహ్నాన్ని మార్చేసి ఆ స్థానంలో లక్ష్మీ దేవి ప్రతిమను (Laxmi devi image) చూపించారు. తద్వారా ఆడియెన్స్ మనోభావాలను గౌరవిస్తున్నామనే సంకేతాన్ని పంపించింది జై భీమ్ యూనిట్. 


తరతరాలుగా అణచివేతకు గురవుతున్న అట్టడుగువర్గాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎలాంటి ఫీజు లేకుండానే వారి తరపున ఉచితంగా న్యాయ పోరాటం చేసిన ఓ న్యాయవాది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ సినిమాను (Jai Bhim movie controversy) టిజె జ్ఞానవేల్ డైరెక్ట్ చేశాడు.