RAM Rapid Action Mission Movie Trailer: యధార్థ ఘటనల ఆధారంగా మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం అవుతుండగా.. ధన్యా బాలకృష్ణ హీరోయన్‌గా యాక్ట్ చేస్తోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను తెరపై ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సైంధవ్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను లాంచ్ చేశారు. అదిరిపోయే డైలాగ్స్‌ టైలర్‌ను ఆకట్టుకునేలా కట్ చేశారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ISM విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్‌ విషయానికి వస్తే.. 'లైఫ్‌ ఈజ్ వార్.. చుట్టూ మనుషులు ఉన్నా.. లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటం నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది.. గెలుస్తావ్ కదా..?' అంటూ తండ్రి డైలాగ్‌తో మొదలుపెట్టారు. 'ఈ 60 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రజలది కాదు.. అధికారులది కాదు.. రాజకీయ నాయుకులది మాత్రమే.. మీరు అప్పుడూ బానిసలే.. ఇప్పుడూ బానిసలే.. ఎప్పుడూ బానిసలే' అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ సూపర్‌గా ఉంది. 


'తాత-తండ్రి, కొడుకు-కోడలు, మనువడు-మనవరాలు ఆల్‌రెడీ తట్టాబుట్టా సర్దేసుకున్నారు.. ఇకపై అయితే రామరాజ్యం.. లేదంటే ప్రజల రాజ్యం.. మధ్యలో కుటుంబ రాజకీయాలు, వారసత్వాలు మనతోని కాదురా బై..' అంటూ హీరో చెప్పే డైలాగ్ నెక్ట్స్‌ లెవెల్. హీరో కళ్లలో త్రివర్ణ  పతాకాన్ని చూపించే షాట్‌తో ఆడియన్స్‌లో గూస్ బంప్స్  రావడం పక్కా. ట్రైలర్‌ చూస్తున్నంతసేపు సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.  


 



రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం, మనతోని కాదురా భై అంటూ సాగే రొమాంటిక్ సాంగ్స్‌ సినిమాకు మరింత ప్లస్ కానున్నాయి. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించగా.. భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆశ్రిత్ అయ్యంగార్ మ్యూజిక్ అందిస్తుండగా.. ధారన్ సుక్రి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా.. త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భారీ ఎత్తున విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook