Sushant Singh Rajput Death Case swara bhaskar over on media: బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్ సింగ్‌‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case) లో రోజురోజుకూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలనే సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) చేయాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో నిత్యం సుశాంత్‌ లవర్ రియా చక్రవర్తికి సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో హాల్ చల్ అవుతోంది. ఈ నేపథ్యంలో నటి స్వరా భాస్కర్‌ (Swara Bhaskar) రియా చక్రవర్తి (rhea chakraborty) కి మద్దతుగా నిలిచారు. మీడియా రియాపై ఉసిగొల్పుతోందంటూ స్వరా భాస్కర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా స్వరా భాస్కర్ ట్విట్టర్‌లో ఇలా రాశారు.. ఉగ్రవాది కసబ్‌ విషయంలో కూడా మీడియా ఇంత దారుణంగా ప్రవర్తించలేదు. కానీ రియా చక్రవర్తి విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తిస్తూ.. ఆమెకు సంబంధించిన కథనాలతో ప్రజలను రెచ్చగొడుతుంది. భారతీయ మీడియాతో పాటు ఇలాంటి విషపూరిత కథనాలను ప్రొత్సాహిస్తున్నందుకు మనం కూడా సిగ్గు పడాలంటూ స్వరా ట్వీట్‌ చేశారు. Also read: Bollywood నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పద్మ భూషణ్ ప్రకటించాలని డిమాండ్!


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో చాలామందిని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ రియా చక్రవర్తి తన కుమారిడికి విషం ఇచ్చి చంపేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలాఉంటే డ్రగ్స్ వ్యవహారంలో రియాపై తాజాగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(NCB) కేసు నమోదు చేసింది.  Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు