Mahesh Babu starrer Sarkaru Vaari Paata movie First Day collections: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు మోస్ట్‌ అవెటెడ్‌ సినిమా 'సర్కారు వారి పాట' గురువారం (మే 12) విడుదలైమా విషయం తెలిసిందే. స్పెషల్ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో.. ప్రేక్షకులు ఎస్‌వీపీ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ ఫుల్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. రెండున్నర ఏళ్ల తర్వాత మహేశ్‌ బాబు నుంచి వచ్చిన సినిమా కావడంతో వీకెండ్ వరకు సినిమా టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్‌వీపీ సినిమాలో మహేశ్‌ బాబు చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు కామెడీ, యాక్షన్‌తో సత్తాచాటారు. ముఖ్యంగా మహేష్ఎం కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. దీంతో తొలి రోజు బాక్సాఫీస్‌ వద్ద ఎస్‌వీపీ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్‌ వసూల్ చేసింది. అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది. 


ఎస్‌వీపీ సినిమా అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. గుంటూరులో రూ.5.83 కోట్లు, సీడెడ్‌లో రూ.4.7 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.73 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.3.25 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3 కోట్లు, కృష్ణాలో రూ.2.58 కోట్లు, నెల్లూరులో రూ.1.56 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొంది. మొత్తం తొలి రోజు రూ.36.69 కోట్లు వచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి సినిమాల్లో ఆల్‌టైం రికార్డు సృష్టించింది.




పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. మ‌హేష్‌ బాబు సరసన కీర్తి సురేశ్‌ నటించారు. ఈ చిత్రంలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Also Read: One Family One Ticket: ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చింతన్‌ శిబిర్‌ లో చర్చ, క్లారిటీ వచ్చే అవకాశం


Also Read: Weight Loss in 15 Days: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఇలా చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook