SVP Pre Release Event: ఆ విషయంలో మహేష్ బాబుతో పోటీ పడలేకపోయా: కీర్తి సురేష్
Keerthy Suresh Comments at Sarkaru Vaari Paata Movie Pre Release Event. `సర్కారు వారి పాట` సినిమాలో మహేష్ బాబుతో నటిస్తున్నప్పుడు ఆయన టైమింగ్ మ్యాచ్ చేయగలనా? లేదా? అని తెగ టెన్షన్ పడ్డాను అని కీర్తీ సురేష్ తెలిపారు.
Keerthy Suresh says I could not rech Mahesh Babu timing in Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఎస్‌వీపీ చిత్రం విడుదల కానుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో శనివారం (మే 7) హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకి పలువురు డైరెక్టర్లు ముఖ్య అతిధులుగా వచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కీర్తీ సురేష్ మాట్లాడుతూ... 'మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఇదివరకే నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల నటించలేకపోయా. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. కళావతి క్యారెక్టర్ నాకు ఇచ్చిన దర్శకుడు పరశురామ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మహేష్ బాబుతో నటిస్తున్నప్పుడు ఆయన టైమింగ్ మ్యాచ్ చేయగలనా? లేదా? అని తెగ టెన్షన్ పడ్డాను. ఇక డబ్బింగ్ చెబుతుంటే.. బాబు గ్లామర్‌తో సరిపోతానా? అని భయపడ్డాను. చూడాలి సినిమాలో ఎలా ఉంటానో మరి. ఒకటి మాత్రం చెపుతున్నా.. ఎస్‌వీపీ సినిమా మీకొక సెలబ్రేషన్ అవుతుంది' అని అన్నారు.
డైరెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ... 'మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కల. ఈ సినిమా కథ రాసి బాబుని కలవాలనుకుని ప్రయత్నం చేస్తుండగా.. నాకు కొరటాల శివ సాయం చేశారు. కథ చెప్పడం మొదలు పెట్టాక ఐదు నిమిషాలకి మహేష్ నవ్వులు మొదలైంది. తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది సినిమా అన్నారు. ఆ ప్రోత్సాహమే నన్ను సినిమా బాగా తీసేలా చేసింది. సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసేందుకు నా శాయశక్తులా ప్రయత్నించా. నాకు ఇంత పెద్ద సినిమా ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతున్నా. చాలా పెద్ద హిట్ అందుకోబోతున్నాం' అని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఎస్‌వీపీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. మహేశ్ బాబు డైలాగ్స్, పరుశురాం టేకింగ్, వెన్నల కిషోర్ టైమింగ్, కీర్తి సురేష్ అందచందాలు అందరిని అలరించాయి. ఈ చిత్రంలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'గీతా గోవిందం' తర్వాత పరశురామ్ తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ ఫాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Yuvraj Singh Captaincy: అందుకే నేను టీమిండియా కెప్టెన్ కాలేకపోయా.. అసలు విషయం చెప్పిన యువరాజ్!
Also Read: Disha Patani: ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ భామ.. వెల్‌కమ్ చెపుతూ ఫ్లవర్ బొకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook