Swara Bhasker receives death threat: తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 5 ఉదయం సలీం ఖాన్‌కు వచ్చిన లేఖ ద్వారా నటుడికి బెదిరింపులు వచ్చాయి. ఈ వార్త పరిశ్రమలో సంచలనం సృష్టించింది. పోలీసులు కూడా విచారణలో నిమగ్నమయ్యారు. ఆ ఘటన మరువక ముందే సల్మాన్ ఖాన్ తర్వాత,  బాలీవుడ్ పరిశ్రమలో నటి స్వర భాస్కర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఆమె ఇంటికి స్పీడ్ పోస్ట్ ద్వారా ఒక లేఖ వచ్చింది,  అందులో స్వరను చంపుతామని బెదిరించారు. లేఖలో వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అవమానించినందుకు స్వరను దుర్భాషలాడారు. ఈ లేఖ చివర సంతకం స్థానంలో 'ఈ దేశ యువత' అని రాసి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందీలో రాసిన ఈ లేఖలో స్వర భాస్కర్‌ను హత్య చేయడంపై నేరుగానే సూచనలు చేశారు. వీర్ సావర్కర్‌ను అవమానించడం మానేసి కేవలం తన సినిమాలపైనే దృష్టి పెట్టాలని నటికి వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖ పంపిన వ్యక్తి పేరు రాయలేదు. అయితే ఈ లేఖ పంపిన వ్యక్తి తనను తాను దేశ యువతలో ఒకరిని అని అభివర్ణించుకున్నారు. మీ భాషను మితంగా ఉంచుకోండి...వీర్ సావర్కర్ కు క్షమాపణలు చెప్పక పోతే సహించబోమని లేఖలో రాశారు. హాయిగా మీ సినిమాల సంగతి మీరు చూసుకోండి,  లేదంటే మీ అంత్యక్రియలు జరుగుతాయని హెచ్చరించారు. ఇక ఈ క్రమంలో స్వర వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


స్వర భాస్కర్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక-రాజకీయ సమస్యల గురించి చాలా ధైర్యంగా మాట్లాడేవారు. 2017లో,  "సావర్కార్ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. జైలు నుంచి బయటకు రావాలని అభ్యర్థనలు చేశారు! కాబట్టి ఆయన ఖచ్చితంగా 'వీర్' కాదు" అని ఒక ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 2019లో కూడా,  "అత్యంత పిరికి 'బహదూర్' "వీర్" సావర్కర్ అని అర్థం చేసుకోండి" అనే వీడియోతో ఆమె మరొక ట్వీట్‌ను పోస్ట్ చేసింది. 


ఈ అంశం మీదనే ఆమెకు బెదిరింపు లేఖ వచ్చిందని భావిస్తున్నారు. ఇక మరోపక్క స్వర భాస్కర్ ఉదయపూర్ ఊచకోతపై ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర భాస్కర్ 2010లో 'గుజారిష్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత,  ఆమె 'తను వెడ్స్ మను',  'రాంఝనా',  'ప్రేమ్ రతన్ ధన్ పాయో',  'నిల్ బట్టే సన్నత',  'అనార్కలి ఆఫ్ ఆరా' మరియు 'వీరే ది వెడ్డింగ్' వంటి సినిమాలకు పనిచేశారు. ఇది కాకుండా,  స్వర 'రాస్భారి',  'ఫ్లెష్' మరియు 'భాగ్ బిన్నీ భాగ్' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా స్వర కనిపించింది.


Also Read: Akshay Kumar: చరణన్న అంటూ అక్షయ్ కామెంట్స్.. ఆడుకుంటున్న మెగాఫాన్స్


Also Read: Anasuya Bharadwaj: జబర్దస్త్ షోకి గుడ్ బై.. ఎమోషనల్ అయిన అనసూయ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook