మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా సినిమా షూటింగ్‌కి అధికారుల నుంచి అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సైరా సినిమాను కూడా రంగస్థలం సినిమా షూటింగ్ జరిపిన చోటే తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ షూటింగ్ కోసం అనుమతి తీసుకోకుండా సెట్స్ వేశారని తెలుసుకున్న స్థానిక రెవిన్యూ అధికారులు.. ఆ సెట్స్‌ని తొలగించినట్టు సమాచారం. నియమ నిబంధనలు అతిక్రమించి సెట్టింగ్స్ వేసినందుకుగాను తాము వాటిని తొలగిస్తున్నట్టుగా అధికారులు సైరా యూనిట్‌కి తెలిపినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో సైరా షూటింగ్ కొంత ఆలస్యమవుతున్నట్టుగా సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.


టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత రామ్ చరణ్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇదే.