Tamannah song from Varun Tej Ghani : మెగా హీరో వరుణ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ 'గని' నుంచి రెండో సాంగ్ విడుదలైంది. హీరోయిన్ తమన్నాపై చిత్రీకరించిన 'కొడితే..' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది. విడుదలైన కాసేపటికే 3 లక్షల పైచిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో ఈ సాంగ్ దూసుకెళ్తోంది. ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించగా హారిక నారాయణ్ ఆలపించారు. సంక్రాంతి పండగ సందర్భంగా గని చిత్ర యూనిట్ ఈ సాంగ్‌ను విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


'రింగారే రింగా రింగా.. రింగ్ ఆఫ్ ది డెస్టినీకి రారా సింగా..' అంటూ సాగే లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. బ్లాక్ డ్రెస్‌లో తమన్నా అంద చందాలు, ఆమె పెర్ఫామెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. 'వాటే పెర్ఫామెన్స్...' అంటూ నెటిజన్లు తమన్నాపై కామెంట్స్ చేస్తున్నారు. 'తమన్నా వయసు ఎప్పటికీ పెరగదు... వైన్‌లా రోజురోజుకు ఆమె మరింత బెటర్‌గా మారుతుంది..' అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.


ఇటీవల 'పుష్ప' సినిమాలో (Pushpa Movie) సమంత నటించిన స్పెషల్ సాంగ్ (Pushpa Samantha Song) 'ఉ అంటావా మావా... ఉ ఊ అంటావా మావా..' సాంగ్ యూట్యూబ్‌లో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన తమన్నా గని సాంగ్ (Ghani Songs) సమంత సాంగ్‌కి పోటీనిస్తుందా అనే చర్చ జరుగుతోంది. గని సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. న‌వీన్ చంద్ర, నదియా, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also read: Telangana : ఇకపై పదవ తరగతి పరీక్షలు 12 ఏళ్లకే రాయవచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook