Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?
Tamil Actor Prabhu Hospitalized ప్రభుని తాజాగా హాస్పిటల్‌లో చేర్పించారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు వైద్యులు.
Tamil Actor Prabhu Hospitalized తమిళ, తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ప్రభు.. ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఆయనకు వైద్యం చేశారని, ఇప్పుడు బాగానే ఉన్నారని, రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు తెలిపినట్టు సమాచారం అందుతోంది.
ఫిబ్రవరి 20న ఆయనకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. వైద్యుల పరీక్షల అనంతరం కిడ్నీ సమస్య గురించి బయటకు వచ్చింది. దీంతో వెంటనే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలిగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షేమంగా ఉందని, రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్టుగా డాక్టర్లు తెలిపారు.
ప్రభు తమిళ, తెలుగు నాట ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శివాజీ గణేషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సొంత స్టార్డంను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానూ రాణించాడు. సపోర్టివ్ రోల్స్‌తోనే ప్రభుకి ఎక్కువగా క్రేజ్ వచ్చింది. డార్లింగ్ సినిమాతో ప్రభు తెలుగు వారికి మరింతగా దగ్గరయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు అయింది. హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రలు అంటే ప్రభు పర్ఫెక్ట్ చాయిస్‌గా ఉంటుంది.
ఇక ప్రభు రజినీకాంత్‌ల మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిందే. రజినీకాంత్ సినిమాల్లో ప్రభుకి ప్రత్యేకమైన పాత్రలుంటాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చంద్రముఖి సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్
Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook