Tamil Veteran Actor Srikanth: తమిళ నటుడు శ్రీకాంత్ మృతి.. రజనీ, కమల్ నివాళి
తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) మంగళవారం అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు.
Tamil Veteran Actor Srikanth passes away: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటులు మరణిస్తున్నారు. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు శ్రీకాంత్(Tamil Veteran Actor Srikanth) మంగళవారం చెన్నైలో మృతి చెందారు.
మిత్రుడి మరణం బాధించింది: రజనీ
వయసు పైబడడంతో వచ్చిన అనారోగ్య కారణాలతో మరణించిన ఆయనకి ఎంతోమంది కోలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా(Social Media) వేదికగా నివాళులర్పించారు. ఆయనతో పాటు భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో కలిసి పనిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్(Rajnikanth) ప్రియమైన స్నేహితుడి మరణం చాలా బాధించిందని చెప్పాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. శ్రీకాంత్ తన చివరి ఇంటర్వ్యూలో.. రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడి ఆశ నెరవేరలేదు.
Also Read: Bigg Boss 5: హైపర్ ఆది క్రేజ్ మామూలుగా లేదుగా..! 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యూనరేషన్!
దిగ్గజ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో సాగనంపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్.. బామా విజయం, పూవ తలైయా, ఎతిర్ నీచల్ వంటిక్లాసిక్ మూవీస్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. శివాజీ గణేషన్, ఆర్.ముత్తురామన్, శివకుమార్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి స్క్రీన్ను పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook