Hero Karthi Facebook Account Hacked : తమిళ, తెలుగు ఆడియెన్స్‌కు కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. హీరో కార్తీ తెరపైనే కాకుండా సోషల్ మీడియలోనూ తన అభిమానులను అలరిస్తుంటాడు. కార్తీ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అలాంటి కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ మేరకు కార్తీ ట్వీట్ వేసి తన అభిమానులను అప్రమత్తం చేశాడు. హలో గాయ్స్.. నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయింది.. ఫేస్ బుక్ టీంతో కలిసి పని చేస్తున్నాం.. నా పేజీని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇలా సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఎవరిదో ఒకరిది ఇలా హ్యాక్ అవుతూనే ఉంటుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఇలా హ్యాక్ అవుతూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి వీటి వల్ల చెడు ఫలితం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీ చూస్తే ఎంత చండాలం ఉంటోందో అందరికీ తెలిసిందే. విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీలో అన్నీ అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంత వరకు విష్ణుప్రియ తన ఫేస్ బుక్ ఖాతా సమస్యలను పరిష్కరించుకోలేకపోయింది.


హీరో కార్తీ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో వల్లవరాయ అంటూ అలరించాడు. మొదటి పార్ట్ మొత్తం కూడా కార్తీ చుట్టూనే తిరిగింది. ఈ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రీసెంట్‌గా సర్దార్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పీఎస్ మిత్రన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. వాటర్ బాటిళ్ల స్కాం నేపథ్యంలో సర్దార్ సినిమాను తీశారు. ఇందులో కార్తీ నటన అదిరిపోయింది.


ఇక కార్తీ కొత్త సినిమా జపాన్‌కు సంబంధించిన అప్డేట్ నేడు రానుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమాన్యుయేల్ నటిస్తోంది. సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ మీద నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు.


Also Read : Sudigali Sudheer Gaalodu : ఈ వారం రాబోతోన్న సినిమాలివే.. చిన్న చిత్రాల సందడి.. ఓటీటీలో గాడ్ ఫాదర్


Also Read : Aadya Video: మొన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆయన కూతురు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook