Comedian Mayilsamy Passes Away కోలీవుడ్ ఫేమస్ కమెడియన్ మయిల్ సామీ (57) గుండెపోటుతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకుంటున్న సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక, శరత్ కుమార్ వంటి వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన లేరనే వార్త తెలిసి నేను తట్టుకోలేకపోతోన్నాను.. ఇది నమ్మాలని నాకు అనిపించడం లేదు అంటూ రాధిక ఎమోషనల్ అయింది. నా స్నేహితుడు, మంచి వ్యక్తి, తత్త్వవేత్త అయిన మయిల్ సామీ మరణించాడనే వార్త విని ఒక్కసారిగా నా షాక్‌కి లోనయ్యాను.. గుండెబద్దలైనట్టుగా అనిపించింది.. ఆయన మరణానికి చింతిస్తున్నాను.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియస్తున్నాను.. అని ఎమోషనల్ అయ్యాడు.


మయిల్ సామీ దగ్గరదగ్గరా రెండొందల చిత్రాలు చేశాడు. ఎన్నో కమెడియన్ రోల్స్ పోషించాడు. ధూల్, వసీగర, గిల్లి, గిరి, ఉత్తమపుథిరన్, వీరం, కాంచన, కంగళ ఖైదు సెయ్ అనే బ్లాక్ బస్టర్ సినిమాల్లోనూ ఆయన తన మార్క్ వేశాడు. మయిల్ సామీ మృతి పట్ల తమిళ చిత్ర సీమ స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటిస్తోంది.


మన టాలీవుడ్‌లో తారకరత్న మృతితో అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఇరవై మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్ బెడ్డు మీదు కదల్లేని స్థితిలో ఉన్న తారకరత్న.. చివరకు శివరాత్రి నాడు శివైక్యం అయ్యాడు. అటు తారకరత్న మరణంతో టాలీవుడ్ బాధలో ఉంటే.. ఇటు కోలీవుడ్‌లో కమెడియన్ మయిల్ సామీ మరణంతో కుంగిపోయింది.


Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook