Vijayakanth : తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన తమిళ సీనియర్ హీరో..
Senior hero Vijayakanth: ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు విజయ్ కాంత్. కాగా ఈ హీరో ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరడం ఆయన అభిమానులను ఆందోళన పరుస్తోంది.
Vijayakanth hospitalized: సినీ ప్రేక్షకులకు తమిళ సీనియర్ హీరో విజయ్ కాంత్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కూడా ఈయన సినిమాలు అప్పట్లో ఎన్నో రీమేక్ అయి విజయం సాధించాయి. అప్పట్లో యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు విజయ్ కాంత్.
ఒక సమయంలో అతనికి చిత్రాలకు భారీగా క్రేజ్ ఉండేది.
కాగా సినిమాలలో బాగా పేరు తెచ్చుకున్నాక పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు విజయ్ కాంత్. సినీ ఇండస్ట్రీ ని వదిలి ప్రజల కోసం డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. తమిళనాడు పాలిటిక్స్ లో ఈయన పాత్ర ఎంతో ఉంది.
ఈ నేపథ్యంలో ఈ హీరో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.ప్రస్తుతం 70 సంవత్సరాల వయసు ఉన్న విజయ్ కాంత్ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత కొద్ది కాలంగా అప్పుడప్పుడు విజయకాంత్ ఆరోగ్యం కొంచెం దెబ్బ తినడం.. ఆ తర్వాత కొన్ని రోజులకు కోల్పోవడం.. ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది.
కానీ ఇప్పుడు ఈ సీనియర్ హీరో ఎక్కువ దగ్గు జలుబు వల్ల తీవ్ర అస్వస్థతకు గురి అయిన విజయ్ కాంత్ మరొకసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. జలుబు ,గొంతు నొప్పి, దగ్గు , జ్వరం వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న విజయ్ కాంత్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది.
కాగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనిని ఇంకా ఒకరోజు అబ్జర్వేషన్ లో ఉంచాల్సినట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఈయన ఆరోగ్యానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి