Taraka Ratna Parents Emotional: నందమూరి మోహనకృష్ణ శాంతి దంపతుల కుమారుడు తారకరత్న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల తారకరత్న మరికొద్ది రోజులలో పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. 22వ తేదీ వస్తే ఆయనకు 40 ఏళ్లు పూర్తయ్యేవి. కానీ అవి పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. జనవరి 27వ తేదీన నారా లోకేష్ ప్రారంభించిన యువగళం అనే పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున పాదయాత్రలో భాగంగా నడుస్తున్న సమయంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడికక్కడే కుప్పకూలి పడిపోవడంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కుప్పం హాస్పిటల్లో ఆయన గుండె సమస్య అర్థం చేసుకొని ఇక్కడ తీరేది కాదని భావించి బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆయనకు సుమారు 23 రోజులపాటు చికిత్స అందించారు. దేశ విదేశాల వైద్యులు వచ్చి ఆయనను బతికించే ప్రయత్నాలు చేశారు కానీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. గుండెపోటు వచ్చిన సమయంలో 45 నిమిషాల పాటు గుండె రక్త ప్రసరణ చేయకపోవడంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడింది. ఆ మెదడు సగం దెబ్బ తినడంతో బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితి నెలకొంది.


సుదీర్ఘంగా పోరాడి 23 రోజుల తర్వాత ఆయన మరణిస్తే మరణించిన రోజు రాత్రి ఆయన పార్థివదేహాన్ని తరలించి హైదరాబాద్ శివార్లలోని మోకిలా అనే ప్రాంతంలో ఉన్న విల్లాకి తీసుకువెళ్లారు. అయితే అక్కడ నందమూరి కుటుంబ సభ్యులు దాదాపు చాలా మంది కనిపించారు కానీ నందమూరి తారకరత్న తల్లి తండ్రి మాత్రం కనిపించలేదు. ఈ విషయం మీద ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లేదు వారు వచ్చారని నందమూరి అభిమానులు వాదిస్తుంటే రాలేదని ఇతర వర్గాల వారు వాదించారు అయితే అసలు విషయం ఏమిటంటే నిజంగానే నందమూరి తారకరత్న తల్లిదండ్రులు మోకిలా నివాసానికి వెళ్లలేదని తెలుస్తోంది.


మోకిలా నివాసం నందమూరి తారకరత్న భార్య అఖిలారెడ్డికి చెందింది కావడంతో కోడలితో ఉన్న విభేదాలు నేపథ్యంలో కుమారుడి చివరి చూపు చూసేందుకు కూడా అక్కడికి వారు వెళ్ళలేదని తెలుస్తోంది. ఎప్పుడైతే తారకరత్న పార్థివదేహాన్ని తీసుకువచ్చి ఫిలిమ్ చాంబర్లో ఉంచారో అప్పటికే ఉన్న తారకరత్న తల్లిదండ్రులు వెళ్లి తారకరత్న పార్థీవదేహాన్ని సందర్శించారు. తారకరత్న తల్లిదండ్రులైతే వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు అయితే ఎంత పంతాలు ఉన్నా చావు దగ్గర మాత్రం ఈ పంతం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.


రేపొద్దున కొడుకు లేడు కాబట్టి కొడుకు వారసులను చూసుకోవాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులదే కదా తారకరత్న భార్య ఇల్లు అని అక్కడికి వెళ్ళని తల్లిదండ్రులు వారి పిల్లలను మాత్రం ఏమాత్రం చూసుకుంటారని నమ్మకం ఏమిటి? అనే వాదన వినిపిస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ ఇదే విషయం మీద తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి మాట ఇచ్చారు. తమ కుటుంబ సభ్యుల లాగానే మిమ్మల్ని కూడా ట్రీట్ చేస్తామని అన్ని విషయాల్లోనూ మీరు కూడా మా వాళ్లేనని హామీ ఇవ్వడంతో అలేఖ్య రెడ్డి కాస్త కుదురుపడ్డారని చెబుతున్నారు. 


Also Read: Balakrishna Taraka Ratna Family: తారక రత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం!


Also Read: Taraka Ratna Death: ఆ ఒక్కడు లేకుంటే బాబు, లోకేష్ ఆ మరకతోనే జీవించాల్సి వచ్చేది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook