Taraka Ratna Biography తారకరత్న గత రెండు వారాల నుంచి హాస్పిటల్ బెడ్డు మీదే ఉన్నాడు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం నాడే తారకరత్న కుప్పకూలిపోయాడు. ముందు అస్వస్థత అన్నారు.. తరువాత తీవ్ర అనారోగ్యం అన్నారు.. ఆపై హార్ట్ ఎటాక్ అన్నారు.. మళ్లీ పరిస్థితి తీవ్రమని ప్రకటించారు. మాసివ్ కార్డియాక్ అరెస్ట్ అని అన్నారు. చివరకు పరిస్థితి విషమన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఎకో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతే విదేశాలకు తీసుకెళ్లాలని యత్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరకు ఫారిన్ డాక్టర్లను రప్పించి తారకరత్నకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇంత జరుగుతూ ఉంటే.. తారకరత్న పర్సనల్ విషయాల మీద నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి కాకుండా ఇతర విషయాల మీద నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు. తారక రత్నకు ఎంత ఆస్థి ఉంది.. ఆయన పర్సనల్ విషయాలు ఏంటి? ఆయన ప్రేమ, పెళ్లి సంగతులు ఏంటి? భార్య ఎలా ఉంది.. పిల్లలు ఎవరు? ఇలాంటి రకరకాల విషయాల మీద సర్చింగ్ చేస్తున్నారట.


తారకరత్న సినిమాల సంగతి ఏంటి? రాజకీయ ఎంట్రీ ఎలా జరిగింది? తారకరత్న మీదున్న కాంట్రవర్సీలు ఏంటి? అంటూ ఇలా నానా రకాలుగా సర్చ్ చేస్తున్నారట. తారకరత్న హెల్త్ అప్డేట్ల గురించి ఇప్పుడు జనాలు వెతకడం మానేసి ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టారట.


గూగుల్‌లో తారకరత్నకు సంబంధించిన సర్చ్ ఎక్కువగా జరుగుతుందట. తారకరత్న కోసం బాలయ్య అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తారకరత్న ఆరోగ్యం గురించి టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మాత్రం అలానే ఉందని తెలుస్తోంది. తారకరత్నకు ఇప్పుడు నాడీ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని, కోమా స్టేజ్ వరకు వెళ్లి వచ్చాడని తెలుస్తోంది.


Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్


Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook