Bigg Boss Telugu: గత సీజన్ల కన్నా కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ కొంచెం ఎక్కువ టిఆర్పి తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే 9 వారాలు అయిపోగా చాలామంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, ఇక నాలుగో వారంలో రతిక రోజ్‌, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో న‌యని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా పోయిన వారం సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన చివరి వరకు ఉంటారు అనుకుంటే మధ్యలోనే వెళ్లిపోయారు. మరోపక్క ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఎక్కువగానే జరిగాయి. ఇలా నిజంగానే ఉల్టా పుల్తాగా సాగుతున్న ఈ సీజన్ లో ఈవారం ఎలిమినేషన్ గురించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.


ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ తొమ్మిదో వారం చివ‌రికి వ‌చ్చేసింది. ఎనిమిది వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. పైన చెప్పినట్టుగా ఒక్కోవారం ఒక్కోరు వెళ్లిపోగా అందులో నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయినా ర‌తిక రోజ్ మాత్రం రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అనే విష‌యం పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొనింది.


తొమ్మిదో వారం నామినేషన్స్ లో అమర్ దీప్, అర్జున్, భోలే, తేజ, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, యావర్ ఉన్నారు. దాదాపు వారం మధ్యలో వరకు వీరి నుంచి శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఎప్పుడూ ఏకంగా ఇంటికి కెప్టెన్ అయిపోయింది. గ‌త మూడు వారాలుగా శోభ శెట్టి కి ఓట్లు త‌క్కువ‌గా వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె సేవ్ అవుతూ వ‌స్తోంది.


ఇక ఈవారం కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడం లేదట. 
 ఈ వారం టేస్టీ తేజా హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్ని అనఫీషియల్ పోల్స్ లో కూడా శోభ శెట్టి తరువాత టేస్టీ తేజ చివరి స్థానంలో ఉంటూ వచ్చారు. కాగా ఇప్పుడు మాత్రం శోభా సేఫ్ అయ్యి  టేస్టీ తేజ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఇదే విషయంపైన అధికారిక వార్త రావాలి అంతే మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సిందే.


Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్‌ లుక్‌లో మెగా బ్రదర్స్‌..!  


Also Read: Blaupunkt Soundbar: చీప్‌ ధరకే బెస్ట్‌ 100W సౌండ్‌ బార్‌..దీపావళి ప్రత్యేక సేల్‌పై అదనంగా 29 శాతం తగ్గింపు! 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి