Teja failures: నా సినిమాలు అందుకే ఫెయిలవుతాయి.. కనెక్ట్ అవ్వలేను.. బయట పెట్టేసిన తేజ!
Teja Reasons for his Movies failures: డైరెక్టర్ తెజకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన చేసిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించేవారు. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు ఆడడం లేదు. దీంతో ఈ విషయంపై ఆయన స్పందించారు.
Teja Reveals Reasons for his Movies failures: రాం గోపాల్ వర్మ స్కూల్ నుంచి బయటకు వచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా నిలిచిన అతి కొద్ది మందిలో డైరెక్టర్ తేజ కూడా ఒకరు. నిజానికి ఒకప్పుడు తేజ డైరెక్ట్ చేసిన చిత్రం, నువ్వు నేను వంటి సినిమాలకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. లవ్ స్టోరీస్ కి పెట్టింది పేరైన తేజ ఈ మధ్య సరైన సినిమాతో హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అహింస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
దగ్గుబాటి వారసుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ అహింసా అనే సినిమాను రూపొందించారు. జూన్ రెండో తేదీన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన సినిమాను ప్రమోట్ చేస్తూనే తన గత అనుభవాలను కూడా బయట పెడుతూ వస్తున్నారు. నిజానికి తేజ నుంచి చివరిగా వచ్చిన సినిమా సీత. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది అంతకు ముందు ఆయన చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రం మంచి హిట్ గా నిలిచింది.
Also Read: Shriya Saran Photos: మెమోరీస్ అంటూ శ్రియ శరన్ హాట్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!
ఇక తాజా ఇంటర్వ్యూలో తన సినిమాలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు తేజా పంచుకున్నాడు. తాను ఒక ఎమోషనల్ పర్సన్ అని ఎలాంటి విషయం వల్ల తన మనసు బాధ పడినా సినిమా నుంచి డిస్కనెక్ట్ అయిపోతారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కేవలం టీం కోసమే ఆ సినిమా పూర్తి చేస్తానని సినిమాతో కనెక్టివిటీ లేకుండానే ఒప్పుకున్నాను కాబట్టి సినిమా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయని చెప్పుకొచ్చారు.
అందువల్ల ఒక్కో సారి తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా పెర్ఫామ్ చేయకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. ఇక రాజమౌళి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన సినిమాలను విదేశాల్లో చూడడం వల్ల ఇండియన్ రూపాయి విలువ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రాజమౌళి సినిమాలో ఉంటాయి కాబట్టి ఆయన రూపాయి వాల్యూను పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook