Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలో కేసీఆర్ నేపధ్యం ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఉద్యమ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR). తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిందీ..నడిపించిందీ కేసీఆర్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్‌కు అంత పట్టుంది. ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నిజంగానే దేవుడనేది కొందరి భావన. ఆ భావనలోంచి వచ్చిన కథే తెలంగాణ దేవుడు(Telangana Devudu). ఇప్పుడు ఈ కధ ఆధారంగా కేసీఆర్ బయోపిక్ రూపుదిద్దుకుంది. హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జిషాన్ ఉస్మాన్-సుష్మిత జంటగా నటించారు. మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. 


ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర పోషించిన జిషన్ ఉస్మాన్ ఉద్వేగభరితమవుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర పోషించడం ఛాలెంజింగ్‌గా ఉందని అంటున్నాడు. ఓ ఉద్యమకారుడిగా పోరాడి గెలిచిన గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం నిజంగా గర్వంగా ఉందంటున్నాడు. తాను ఇంటర్నీడియట్‌లో ఉండగా హరీష్ రావు తనకు, తన తండ్రికి తెలంగాణ దేవుడు కధ విన్పించారన్నాడు జిషాన్ ఉస్మాన్. కేసీఆర్ బయోపిక్(KCR Biopic) అనగానే వెంటనే అంగీకరించానని చెప్పాడు. ఈ పాత్ర చేయడానికి కేసీఆరే స్పూర్తి అంటున్నాడు. తెలంగాణ గురించి గతంలో తనకు అంతగా తెలియదని..ఈ కథ విన్న తరువాత పూర్తిగా తెలిసిందన్నాడు. ఈ సినిమాలో కేసీఆర్ స్కూల్‌డేస్ నుంచి పెళ్లయ్యేవరకూ ఉన్న భాగంలో తన పాత్ర ఉంటుందన్నాడు.


Also read : RRR: 'నాటు నాటు.. ఊర నాటు' సాంగ్ వచ్చేసింది..డ్యాన్స్‌ ఇరగదీసిన చరణ్-ఎన్టీఆర్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook