Telangana Govt gives permission to 5th show for Pushpa movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప' (Pushpa). కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా క‌లిసి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్‌.. 'పుష్ప: ది రైజ్‌' శుక్రవారం (డిసెంబర్ 17 ) దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలయ్యే పుష్ప సినిమా విడుదలకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప మూవీపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక ప్రకటన చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమా కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) అనుమతి ఇచ్చింది. దాంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో ఐదు షోలు (5th show for Pushpa) వేయనున్నారు. డిసెంబర్‌ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అదనపు షో ప్రదర్శించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు రూ. 50 టికెట్ల పెంపుపై కూడా ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఈ నిర్ణ‌యంతో పుష్ప మేక‌ర్స్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు రానున్నాయి. 


Also Read: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి దక్షిణాఫ్రికా దిగ్గజం.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే!!


ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న పుష్ప సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది. 'పుష్ప' మొదటి పార్ట్ రన్‌ టైమ్‌ 179.51 నిమిషాలు. దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) స్వరాలు అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా (Pushpa movie)ను రూపొంచారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో, రష్మిక శ్రీవల్లి పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో మ‌లయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. సునీల్, అన‌సూయ‌, అజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా టిక్కెట్ల కోసం అభిమానులు ఇప్పటినుంచే ఎగబడుతున్నారు. 




Also Read: Omicron : ఒమిక్రాన్‌తో చాలా ప్రమాదం.. మొత్తం ఆరోగ్య వ్యవస్థే నాశనం.. శాస్త్రవేత్తల వార్నింగ్




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి