Bheemla Nayak: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగే ఇగ!!
Bheemla Nayak Movie have 5th Show in Telangana: పవన్ కల్యాణ్ తాజాగా నటించిన `భీమ్లా నాయక్` సినిమా ఐదో ఆట ప్రదర్శనకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ విషయం తెలుసున్న పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Bheemla Nayak Movie have 5th Show in Telangana: 'వకీల్‌సాబ్' లాంటి హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిచిన భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు నటించారు.
మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ఐదో ఆట ప్రదర్శనకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ విషయం తెలుసున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు భీమ్లా నాయక్ సినిమాకు థియేటర్లలో ఐదో ఆట కూడా ఉంటుంది.
'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయగా.. మరికాసేపట్లో యూసుఫ్‌గూడలోని పోలీసు గ్రౌండ్స్‌లో 'ప్రీ రిలీజ్ ఈవెంట్' ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Also Read: Dhoni vs Kohli: బుమ్రా సతీమణితో ఆసీస్ మాజీ క్రికెటర్.. ధోనీ, కోహ్లీ సారథ్యంపై ఏమన్నాడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook