RRR: `ఆర్ఆర్ఆర్`కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపుకు అనుమతి...
RRR Movie Latest Updates: తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
RRR Movie Latest Updates: రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న, ఎన్టీఆర్, చెర్రీ ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రూ.336 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనన్న ఆసక్తి సినీ ఇండస్ట్రీలో నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతినివ్వగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో ప్రకారం.. రాష్ట్రంలోని సాధారణ థియేటర్లలో మొదటి 3 రోజుల వరకు టికెట్‌పై రూ.50 పెంపు, ఆ తర్వాత వారం రోజుల వరకు రూ. 30 పెంచుకునే వెసులుబాటును కల్పించారు. మల్టీప్లెక్స్‌లలో మొదటి మూడు రోజులకు రూ.100, ఆ తర్వాత వారం రోజులకు రూ.50 మేర పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, మార్చి 25 నుంచి 10 రోజుల పాటు థియేటర్లలో రోజుకు ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. టికెట్‌పై రూ.75 పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్ల పెంపుకు అనుమతినివ్వడంతో ఇక బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్‌కు వసూళ్ల వర్షం ఖాయమంటున్నారు.
కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడక తప్పలేదు. ఎట్టకేలకు ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీమ్ నిజ జీవిత పాత్రలకు ఫిక్షన్‌ను జోడించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: CM KCR Emergency Meeting: ఫామ్‌హౌజ్‌లో మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
Capgemini Recruitment: క్యాప్ జెమినిలో డిగ్రీ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్... పూర్తి వివరాలివే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook