Yadavalli Lakshmi Narasimha Shastri Passes Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. అనేక తెలుగు, కన్నడ సినిమాలకు రచయితగా పనిచేసిన ఎడవల్లి వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. వైవిఎల్ ఎన్  శాస్త్రిగా పేరు తెచ్చుకున్న ఆయన వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు ఆయనను ఎడవల్లిగా సినీ పరిశ్రమలో సంబోధిస్తూ ఉంటారు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే తండ్రి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్గా నెల్లూరులోనే పనిచేసేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రాన్స్ఫర్ అవ్వడంతో విజయవాడ వెళ్లి స్థిరపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడే ఎడవల్లి హై స్కూల్ చదువు పూర్తి చేశారు ఆ తర్వాత ఎంఏ దాకా చదివిన ఆయన చిన్నతనం నుంచి సాహిత్యం మీద ఆసక్తి చూపిస్తూ ఉండేవారు.  విజయవాడకు చెందిన రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన మాదిరెడ్డి సులోచన రాసిన తరం మారింది అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి సినిమాగా తీయగా దానికి తగిన భాష యాస సమకూర్చి సినీ రంగ ప్రవేశం చేశారు.


అలా చెన్నై వెళ్ళిన ఆయన అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తో కలిసి పని చేశారు. తర్వాత విక్టరీ మధుసూదన్ రావు తో కలిసి ఆయన ఆత్మ కథకు కూడా వర్క్ చేశారు. అయితే ఇలా తెలుగు సినిమాలకు పని చేస్తున్న ఎడవల్లిని నటి లక్ష్మి కన్నడ సినీ పరిశ్రమకు సైతం పరిచయం చేశారు. అప్పటి నుంచి తెలుగు సినిమాలతో పాటు కన్నడ సినిమాలకు సైతం ఆయన పని చేస్తూ వచ్చారు. దాదాపు 15 కన్నడ సినిమాలకు ఆయన రచన సహకారం అందించారు.


అలాగే ఒక తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమ గురించి పలు పుస్తకాలు సైతం రచించారు. ఎడవల్లి ప్రస్తుతానికి కేంద్ర సెన్సార్ బోర్డ్ సీబీఎస్సీ సభ్యుడిగా అలాగే లాంగ్వేజ్ ఎక్స్ పర్ట్ సేవలు అందిస్తున్నారు. ఎడవల్లి ఇప్పటికీ వివాహం చేసుకోలేదు ఆయన అనారోగ్య కారణాలతో విజయవాడలో నివసిస్తున్న తన తమ్ముడు ఎడవల్లి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ప్రస్తుతానికి అక్కడే ఉంటున్నారు. అయితే తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయనను హాస్పిటల్ కి తీసుకెళ్లి సుమారు 50 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నా కోలుకో లేదు. ఎట్టకేలకు శనివారం రాత్రి ఆయన కన్నుమూయడంతో ఆదివారం ఉదయం విజయవాడలో ఆయన అంత్యక్రియలు జరిపారు.


Also Read: Balakrishna Kind Heart: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలయ్య.. 40 లక్షలు అడిగితే మారు మాట్లాడకుండా బతికించాడు!


Also Read: RK Roja on Nagababu: గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన.. నాగబాబుకు ఆర్కే రోజా ఘాటు కౌంటర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook