Telugu Movies in OTT: ఒకే రోజు 13 సినిమాలు.. ఏయే యాప్ లో ఏయే సినిమా వస్తుందంటే?
Telugu Movies in OTT: తాజాగా జూన్ 22వ తేదీ 13 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలు-వెబ్ సిరీసులు కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.
Telugu Movies and Web Series Releasing in OTT This week: కరోనా కంటే ముందే ఓటీటీ పరిధి పెరిగినా కరోనా తర్వాత జనం వాటికి బాగా అలవాటు పడ్డారు. కష్టపడి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే ఇంట్లో కాలు కదపకుండా సినిమాలు, సిరీసులు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు సైతం డిజిటల్ కంటెంట్ మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా జూన్ 22వ తేదీ 13 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుండటం విశేషం.
ఈ సినిమాలు-వెబ్ సిరీసులు కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక అవేమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లో వెంకటేష్-వరుణ్ తేజ్ F3 సినిమాతో పాటు, ధనుష్ హీరోగా తెరకెక్కిన గ్రే మ్యాన్ మూవీ ఇంగ్లీష్‌తో పాటు 5 భారతీయ భాషల్లో విడుదల అవుతోంది. అలాగే బ్లౌన్ అవే అనే ఇంగ్లీష్ సిరీస్ కి చెందిన సీజన్ 3 విడుదల వుతోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎనీథింగ్ పాసిబుల్ అనే ఒక ఇంగ్లీష్ మూవీ విడుదల కానుంది.
ఇక జీ5 యాప్ లో నోడి స్వామి ఇవను ఇరోదే హీగే అనే ఒక కన్నడ మూవీ విడుదల అవుతోంది. మరోపక్క డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇన్ ది సూప్: ఫ్రెండ్‌కాషన్ అనే ఒక కొరియన్ సిరీస్, ఘర్ వ్వాపసీ అనే ఒక హిందీ సిరీస్ విడుదల కానున్నాయి. ఇక సోనీ లివ్ లో మీమ్ బాయ్స్ అనే ఒక తమిళ సిరీస్, డాక్టర్ అరోరా అనే ఒక హిందీ సిరీస్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న F3 కూడా విడుదల అవుతుంది.
మరోపక్క ఆహాలో షణ్ముఖ్ జస్వంత్ నటించిన ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే తెలుగు సిరీస్ విడుదల అవుతోంది. అలాగే వూట్ యాప్ లో ఫిజిక్స్ టీచర్ అనే కన్నడమూవీ, మాస్టర్ చెఫ్ అనే ఒక అమెరికన్ సిరీస్ సీజన్ 11 స్ట్రీమ్ కానుంది. అలాగే ఎంఎక్స్ ప్లేయర్ లో రుహనీయత్ అనే హిందీ సిరీస్ సీజన్ 2 ప్రసారం కాబోతోంది.
Also Read: Samantha Ruth Prabhu: రణవీర్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఫిదా అంటూ సమంత కామెంట్స్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook