Sankranthi Movies 2024 : సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. ప్రతి ఏడాది జనవరి రెండవ వారంలో ఎక్కువ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరూ తమ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాదాపు అందరూ నిర్మాతలు పండగ సమయంలో తమ సినిమాని విడుదల చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఏడాది 2024 లో సంక్రాంతి కి కూడా ఇలానే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో మొదటిగా సంక్రాంతి బరిలో దిగనున్న సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం. జనవరి 12న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది.


ఆసక్తికరంగా చిన్న హీరో తేజ సజ్జ కూడా తన హను మ్యాన్ సినిమాని అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ లో ఎటువంటి మార్పు లేదని భీష్ముంచుకొని మరి కూర్చున్నారు. జనవరి 13న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అదే రోజు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సైంధవ్ కూడా విడుదల కాబోతోంది.


మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో విడుదల కాబోతున్న ఈగల్ సినిమా కూడా జనవరి 13 నే రిలీజ్ కాబోతోంది. ఇక జనవరి 14 లేదా 15 తేదీల్లో కింగ్ నాగార్జున కూడా నా సామి రంగా సినిమాతో సంక్రాంతి బరి లోకి దిగబోతున్నారు.


ఈ నేపథ్యంలో అసలు రెండు తెలుగు రాష్ట్రాలు ఆరు సినిమాలకు థియేటర్లను అందించగలమా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అన్నీ సినిమాలకి మంచి టాక్ వచ్చినా కూడా కచ్చితంగా కలెక్షన్ల విషయంలో తేడాలు వస్తాయి. ఇక యావరేజ్ లేదా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం రెండు మూడు రోజుల్లో సినిమా సింగిల్ స్క్రీన్ ల నుంచి కూడా వెళ్ళిపోతుంది.


పైగా తక్కువ సమయంలో ఆరు సినిమాలు చూడటానికి ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి చూపించరు. వీటిల్లో చాలా వరకు సినిమాలకి టాక్ ను బట్టే కలెక్షన్లు వస్తాయి. ఒకే వారంలో ఏకంగా 6 సినిమాలు చూసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మరి డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తమ సినిమాలను విడుదల చేస్తారా లేక వెనకడిగేసి పోస్ట్ పోన్ చేసుకుంటారా అనేది తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి


 


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook