Telugu Movies Releasing in Theaters and OTT This Week: ఈ వారం పలు ఆసక్తికర సినిమాలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సందడి చేయడానికి రంగం సిద్ధమైంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన అంటే బుధవారం నాడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా, మన్మధుడు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా, బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతి ముత్యం సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ పూరీ జగన్నాద్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా కొణిదెల ప్రొడక్షన్స్- సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద నిర్మించారు. ఇక నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఈ సినిమాని సునీల్ నారంగ్ పుస్కూర్  రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు.


ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిర్మించారు. ఇక ఈ వారం అక్టోబర్ 5వ తేదీన సినిమాలు ఓటీటీ వేదికగా సందడి చేయబోతున్నాయి. వాటిలో ఈషో అనే మలయాళ సినిమా సోనీ లివ్ లో ప్రసారం కాబోతోంది. అలాగే జీ5 యాప్ లో కార్తికేయ 2, గాలిపటా 2 సందడి చేయబోతున్నాయి. కార్తికేయ 2 తెలుగు సహా మిగతా అన్ని భాషల్లో విడుదల కాబోతుండగా గాలిపటా 2 కేవలం కన్నడ భాషలో అందుబాటులో రానుంది.


ఇక సింప్లీ సౌత్ అనే ఓటీటీలో ఒట్టు అనే మలయాళం మూవీ స్ట్రీమ్ కాబోతోంది. అలాగే నెట్ఫ్లిక్స్ వేదికగా లక్కీయస్ట్ గర్ల్ అలైవ్ అని ఇంగ్లీష్ సినిమా, ఒరు తెక్కెన్ తెల్లు కేసు అనే మలయాళ సినిమా రిలీజ్ కాబోతున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో మజామా అనే హాలీవుడ్ సినిమా విడుదల కాబోతోంది అలాగే జీ ఫైవ్ లో రక్షాబంధన్ సినిమా స్ట్రీమ్ అవ్వబోతుంది. ఇవి కాకుండా తెలుగులో ఉనికి, దర్జా సినిమాలు ఆహాలో స్ట్రీమ్ కాబోతున్నాయి. ఇవన్నీ అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కబుతూ ఉండడం గమనార్హం. 


Also Read: Adipurush Teaser: మరీ ఇలా అయితే ఎలా.. నిర్మాణ సంస్థల మధ్య ఆ మాత్రం అండర్ స్టాండింగ్ లేదా?


Also Read: Allu Arjun Trivikram Shooting: అల్లు అర్జున్ తో షూట్ మొదలెట్టిన త్రివిక్రమ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook