Actor Rajendra prasad:  తెలుగు సీనియర్‌ హస్యనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో నిన్న మరణించారు. శుక్రవారం కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. కాగా రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇక గాయత్రి మరణం తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి:  దసరా ముందు రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. నేడు రూ.2000 ఖాతాల్లో జమా..  


ఈ ఘటనతో రాజేంద్ర ప్రసాద్‌ షాక్‌కు గురయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఇది బిగ్‌ షాక్‌. ఎందుకంటే కేవలం 38 ఏళ్ల గాయత్రీ కార్డియాక్‌ అరెస్ట్‌ అవ్వడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. నిన్న శుక్రవారం కార్డియాక్‌ అరెస్టు అవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించగా నేడు ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు.


ఇదీ చదవండి: పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయం..  


రాజేంద్ర ప్రసాద్‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకిఎదిగారు. మంచి కమేడియన్‌, యాక్టర్‌గా కూడా పేరుపొందారు. ఆ తర్వాత ఆయన హీరోగా కూడా పనిచేసి తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే, ఆయన వారసులు ఎవరూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. ముఖ్యంగా ఈ విలక్షణ నటుడు ముక్కుసూటి వ్యక్తిత్వం కలవారు. అయితే, ఓ సినిమా ఈవెంట్‌లో మాత్రం తన కూతురు ఒంటరిని చేసి ప్రేమించినవారితో వెళ్లిపోయిందని  కన్నీటిపర్యంతమయ్యారు. అప్పట్లో అందరినీ ఈ ఘటన షాక్‌కు గురిచేసింది
 


ముఖ్యంగా ఈ ప్రిరిలీజ్‌ ఈవెంట్లో మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్‌ సాధారణంగా అందరూ అమ్మలేని వారు కూతురులో తల్లిని చూసుకుంటారు. నా తల్లి నా పదేళ్ల వయస్సులోనే చనిపోయింది. అందుకే నేను నా కూతురిలో నా తల్లిని చూసుకున్న కానీ, తను కూడా ప్రేమించినవాడితో వెళ్లిపోయి నన్ను ఒంటరిని చేసిందని ఎమోషన్‌ అయ్యారు. అయితే, తన కూతురు కార్డియాక్‌ అరెస్టుతో చనిపోవడంతో నేడు చనిపోవడంతో ఇది ఆయనను మరింత కుంగదీస్తుంది. అయితే, రాజేంద్రప్రసాద్‌ కొత్తగా రిలీజ్‌ కానున్న లగ్గం సినిమాలో కూడా నటించారు.


 


గాయత్రికి భర్త కూతురు ఓ కుమారుడు ఉన్నారు. కూతురు మహానటి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.తెలుగు ప్రముఖ నటుడు తనదైన ముద్ర వేసుకున్న రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్‌ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. చిన్న వయస్సులోనే కూతురును పోగొట్టుకున్న ఆయన బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి తరలించారు. ఈరోజు లేదా రేపు మధ్యహ్నం గాయత్రి అత్తగారి స్వంత ఊరులో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆమె భర్త మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేయగా ఆమె ప్రముఖ బ్యూటీషియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter