Tollywood 2023: ఈ ఏడాదిలో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా
Year Ender 2023: ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే సంవత్సరానికి 5, 6 సినిమాలు చేసేవారు. రామారావు, కృష్ణ లాంటి హీరోలు ఒకే సంవత్సరం 10 సినిమాలకు పైగా నటించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత తరం మాత్రం మారిపోయింది.. సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చెయ్యడం లేదు మన స్టార్ హీరోలు..
Tollywood Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోలు సంవత్సరానికి 10 సినిమాల పైన చేసేవారు. అది కాస్త రోజులు గడీచే కొద్దీ తగ్గుతూ వచ్చింది.. చిరంజీవి తరం వాళ్లు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండగా.. ప్రస్తుత తరం వాళ్లు మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేయకుండా తయారయ్యారు. ఈ సంవత్సరం ఎంతోమంది స్టార్ హీరోలు.. అసలు మనకి వెండి తెర పైన కనిపియనే లేదు. మరి 2023 సంవత్సరం సినీ అభిమానులు మిస్ అయిన సినీ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..
అల్లు అర్జున్
అల్లు అర్జున్ అభిమానులకు ఈ సంవత్సరం ఆయన నేషనల్ అవార్డు విన్ అయిన మొదటి తెలుగు హీరోగా నిలిచి ఎంతో ఖుషి చేసిన.. వెండితెర పైన అసలు ఈ సంవత్సరం అంతా కనిపించకుండా నిరాశ కూడా పరిచారు. పుష్ప'(ది రైజ్) తర్వాత ‘పుష్ప 2′(ది రూల్) కోసం చాలా టైం తీసుకుంటున్నారు ఈ హీరో. దాంతో గత రెండు సంవత్సరాలగా అనగా 2022 తో పాటు 2023 లో కూడా అతని సినిమా రాలేదు. ఇక ఆయన నటిస్తున్న పుష్పా రెండో భాగం 2024 ఆగస్టు 15 న రిలీజ్ కాబోతుంది అని దర్శకుడు సుకుమార్ ఈ మధ్యనే ప్రకటించారు. మొత్తానికి ఇలా మూడు సంవత్సరాల కి గాను ఒక సినిమా విడుదల చేస్తున్నారు ఈ హీరో.
మహేష్ బాబు
ఈ మధ్యనే తన తండ్రి కృష్ణని కోల్పోయిన మహేష్ బాబు తన సినిమా షూటింగుని కూడా వాయిదా వేసుకుంటూ వచ్చారు. 2022 లో ‘సర్కారు వారి పాట’ తో అలరించిన మన ప్రిన్స్.. దర్శకుడు త్రివిక్రమ్ తో తాను చేస్తున్న ప్రస్తుత చిత్రం ‘గుంటూరు కారం’ కోసం చాలా టైం తీసుకున్నాడు. షూటింగ్ విషయంలో ఎన్నో వాయిదాల పడుతూ వచ్చిన ఈ చిత్రం ఫైనల్ గా 2024 జనవరి 12 న విడుదల కాబోతుంది.
జూనియర్ ఎన్టీఆర్
ప్రపంచ స్థాయిగా పేరు తెచ్చుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్
ఆర్.ఆర్.ఆర్ సినిమా తరువాత తన తదుపరి చిత్రం దేవరా షూటింగ్ మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రావడమే కాకుండా పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. కాగా ఈ చిత్రం మొదటి భాగాన్ని 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.
రామ్ చరణ్
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించిన మరో హీరో రాంచరణ్ .. ఆ సినిమా అయిన వెంటనే ‘ఆచార్య’ సినిమాలో స్పెషల్ రోల్ చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇక 2023 లో అతని నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ నత్త నడకన సాగుతుంది. మరి ఈ చిత్రం 2024లో అన్న విడుదల అవుతుందో లేదో చూడాలి.
మరోపక్క సీనియర్ హీరోలు నాగార్జున.. వెంకటేష్ నుంచి కూడా ఈ సంవత్సరం మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు. వీరిద్దరూ నటిస్తున్న నా సామిరంగా .. సైందవ్.. సినిమాలు 2024 జనవరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook