Thalapathy 67 Kashmir Schedule దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చేసింది. చిత్రయూనిట్ అంతా కూడా కొత్త షెడ్యుల్ కోసం కాశ్మీర్‌కు పయణమైంది. ఈ టీంతో పాటే విజయ్ కూడా ఫ్లైట్ ఎక్కేశాడు. త్రిష కూడా ఇందులో కనిపిస్తోంది. త్రిష, విజయ్ కలిసి పక్కనే కూర్చున్నట్టుగా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక విజయ్ లాంటి స్టార్ హీరో ఫ్లైట్ ఎక్కితే అక్కడ ఉండే సందడి వేరు. కానీ విజయ్ మాత్రం ఎంతో సింప్లిసిటీని మెయింటైన్ చేశాడు. ఫ్లైట్లో అందరి వద్దకు వెళ్లి పలకరించాడు. కెమెరా పట్టుకుని అందరినీ ఫోటోలు, వీడియోలు తీశాడు. ఫైట్ స్టాఫ్‌తోనే ముచ్చట్లు పెట్టాడు. 


చిన్న పాపను దగ్గరకు తీసుకుని పలకరించాడు. ఇక విజయ్, త్రిషలు ముందు వరుసలో కూర్చున్నాడు. నేటి సాయంత్రం ఈ మూవీ టైటిల్‌ పేరు బయటకు వచ్చేలా ఉంది. చూస్తుంటే ఈ సినిమాకు కే అనే టైటిల్ పెట్టబోతోన్నట్టుగా తెలుస్తోంది.


 



ఈ మూవీ టీం ఇన్ని రోజులు చెన్నైలోనే సైలెంట్‌గా షూటింగ్ చేశారు. రీసెంట్‌గానే సినిమా యూనిట్‌ కొన్ని అప్డేట్లు ఇచ్చింది. ఇందులో మిస్కిన్, అర్జున్, గౌతమ్ మీనన్, శాండీ, మాథ్యూ, త్రిష, ప్రియా ఆనంద్, సంజయ్ దత్ వంటి వారు నటిస్తున్నారంటూ ప్రకటించారు. ఇక ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్తున్నట్టుగా ప్రకటించింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తే ఇంకెలా ట్రెండ్ అవుతుందో చూడాలి.


Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే


Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook