Thalapathy 67 Look దళపతి విజయ్ వారసుడు సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు విజయ్ తన కొత్త సినిమా మీద ఫోకస్ పెట్టేశాడు. లోకేష్ కనకరాజ్‌తో విజయ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే నటుడు మనోబాలా వేసిన ట్వీట్‌తో ఈ సినిమాను అనౌన్స్మెంట్ అధికారికంగా ప్రకటించేసినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Thalapathy 67 మూవీ సెట్‌లో అడుగుపెట్టాను.. దళపతి విజయ్‌తో కలిసి పని చేస్తున్నాను అంటూ మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉందంటూ మనోబాలా ట్వీట్ వేయడంతో అంతా ఖుషీ అయ్యారు. ఇలా అధికారికంగా ప్రకటించడంతో తన తప్పు తెలుసుకున్న మనో బాలా వెంటనే ట్వీట్‌ డిలీట్ చేశాడు.


ఇక ఇప్పుడు దళపతి 67వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. విజయ్ లుక్ ఇలానే ఉంటుందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే అది విజయ్ ఫోటోయేనా? లోకేష్ కనకరాజ్‌తో చేయబోతోన్న సినిమా లుక్కేనా? అన్నది తెలియడం లేదు. చూస్తుంటే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్‌లానే అనిపిస్తోంది. కానీ ఆ లుక్ మీద సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.


ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో మాస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మాస్టర్‌ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. అయితే లోకేష్ కనకరాజ్ స్టైల్లో ఆ సినిమా లేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చేయబోతోన్న సినిమా మాత్రం లోకేష్‌ సినిమాటిక్ యూనివర్సిటీలానే ఉంటుందని తెలుస్తోంది. విక్రమ్ స్టైల్లోనే ఈ చిత్రం ఉండబోతోందని సమాచారాం.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook