Tamilaga Vettri Kazhagam: తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు రాజకీయాల వైపు వచ్చిన సంగతి మనకు తెలిసింది. సీనియర్ ఎన్టీఆర్, ఎం జి ఆర్, జయలలిత లాంటివాళ్ళు సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వీరే కాకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా ఈ మధ్య రాజకీయాల వైపు వచ్చి తమ హవాని కొనసాగిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వీర్ల దారినే ఫాలో అవుతున్నాడు తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్. విజయ్ రాజకీయాల వైపు మక్కువ చూపిస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి ఈ హీరో రాజకీయ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉండగా.. ఈరోజు విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ పార్టీ పేరుని కూడా బయటపెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. 


లోక్‌సభ ఎన్నికల్లో సమీపిస్తోన్న వేళ ఆయన పార్టీ ప్రకటన చేయడంతో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


ముందుగా చెప్పిన తమిళనాడులో సినీ చరిష్మాతో ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధి, ఎం.జి రామచంద్రన్, జయలలిత, టి.రాజేందర్, కారుణాస్, గౌతమి, సీమాన్, శరత్ కుమార్, కుష్బూ, రాధా రవి, విజయ్ కాంత్, కమల్ హాసన్.. తాజాగా ఉదయనిధి స్టాలిన్.. మీరందరూ కూడా తమిళనాడులో సినిమా రంగం నుంచి పొలిటికల్ వైపు వచ్చిన వారే. అయితే అందులో కొంతమంది సక్సెస్ కాగా మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్స్ గా నిలిచారు. ఇందులో ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చిన హీరో ఉదయనిధి స్టాలిన్.  ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడు మాత్రమే కాదు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు. 


ఇక ఇప్పుడు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఆయన పైనే పడింది.


Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!


Also read: Ayodhya Ram Mandir Darshan: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే...


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook