Thalapathy Vijay-chennai flood victims: మిగ్‌జాం తుపాన్ ప్రభావం నుంచి తమిళనాడు ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఈ సైక్లోన్ ధాటికి చెన్నైతోపాటు నెల్లై, తూత్తుకుడి, తెన్‌కాసి, కన్యాకుమారి త‌దిత‌ర ప్రాంతాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 17,18 తేదీల్లో సంభవించిన ఈ తుపాన్ ఎంతో మందిని రోడ్డుకిడ్చింది. చాలా మంది జీవనోపాధి కోల్పోయారు. ఈ భారీ వర్షాలకు ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ వేలాది మంది పట్టెడన్నం దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వరదల్లో నష్టపోయిన ప్రజలకు హీరో విజయ్ తాజాగా ఆర్థిక సాయం అందించారు. విజ‌య్ తన చేతుల మీదుగా పేద ప్ర‌జ‌ల‌కు నిత్యావసర సరకులు అందించారు. అలాగే వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 10000 నుంచి రూ. 15000 వరకు ఆర్థిక స‌హాయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ కంటే ముందు హీరో సూర్య బ్రదర్స్ చెన్నై ప్రజలను ఆదుకున్నారు. హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తీ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.  



ఇదిలా ఉంటే డిసెంబరు 28న కెప్టెన్ విజయ్ కాంత్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన దళఫతి విజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్ కుటుంబ సభ్యులను పరామర్శంచి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి విజయ్ మీదకు చెప్పు విసిరాడు. ఇది కాస్త వైరల్ అయింది. ఇకపోతే విజయ్ కాంత్ సినిమాలో విజయ్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. 


Also Read: Devil Collections Day 1: బాక్సాఫీస్ పై డెవిల్ దండయాత్ర.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook