Vijay Beast: విజయ్ `బీస్ట్`కి బ్రేకులేసిన మరో ప్రభుత్వం.. కారణం ఏంటంటే?
Vijay`s Beast Movie banned in Qatar. కువైట్‌లో బీస్ట్ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఖతార్ కూడా ఈ జాబితాలో చేరింది. బీస్ట్ సినిమా ఖతార్‌లో కూడా నిషేధించబడింది.
Beast Movie banned in Qatar after Kuwait : కోలీవుడ్ అగ్ర కథానాయకుడు 'దళపతి' విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. 'డాక్టర్' ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. దళపతి ఫాన్స్ బీస్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బీస్ట్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడదామనుకున్న విజయ్‌కి వరుష షాకులు తగులుతున్నాయి. కువైట్‌లో బీస్ట్ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఖతార్ కూడా ఈ జాబితాలో చేరింది. బీస్ట్ సినిమా ఖతార్‌లో కూడా నిషేధించబడింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తన ట్విట్టర్‌లో ద్వారా ధృవీకరించారు. 'బీస్ట్ సినిమాను కువైట్‌లోనే కాకుండా ఖతార్‌లో కూడా బ్యాన్ చేశారు. తాజా తమిళ చిత్రం ఎఫ్ఐఆర్‌ను ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి' అని ట్వీట్ చేశారు.
ఉగ్రవాదులు, హైజాక్స్ నేపథ్యంలో సాగే కథ కాబట్టే బీస్ట్ సినిమాను ఖతార్‌లో బ్యాన్ చేసినట్టు రమేష్ బాలా చెప్పారు. ప్రధాన విలన్ మరియు అతని గ్యాంగ్.. ఇస్లామిక్ టెర్రరిస్ట్ ముఠాకు చెందినవారు అని చుపిండడం ఓ కారణం అట. అల్-ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి టెర్రరిస్ట్ ముఠాల పేర్లు ప్రభావం చుపిస్తాయని ఇంకో కారణం అని పేర్కొన్నాడు. బీస్ట్ సినిమా కథపై ఖతార్ ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని, ఈ చిత్రం అక్కడి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉందని రమేష్ బాలా అంటున్నాడు. ఇంతకుముందు కురుప్, ఎఫ్ఐఆర్ చిత్రాలను ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి.
తాజాగా బీస్ట్ తెలుగు ట్రైలర్లను చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగులో విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాల 55 సెకండ్ల నిడివి గల వీడియోను విడుదల చేశారు. షాపింగ్ మాల్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడన్నదే అసలు కథ. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Also Read: KGF Chapter 2: జతకట్టిన కేజీఎఫ్-ఆర్‌సీబీ.. చాఫ్టర్ 2 ముందే వచ్చింది! ఒకే ఫ్రెమ్‌లో యష్, కోహ్లీ
Also Read: Harshal Patel: బయోబబుల్ వీడిన బెంగళూరు స్టార్ బౌలర్.. చెన్నైతో మ్యాచ్‌లో ఆడేది అనుమానమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook