Thalapathy Vijay Varasudu Trailer దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లో భారీ మార్కెట్ ఉంది. తెలుగులో కాస్త తక్కువగా ఉంటుంది. అయితే దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇద్దరూ కూడా తమిళ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీసినట్టుగా చెబుతున్నారు. ఇది పక్కా తమిళ సినిమా అని, విజయ్ సినిమా అని చెబుతూనే వచ్చారు. ఇక ఈ విషయంలో నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే హీరో శ్రీకాంత్ మాత్రం ఇది పక్కా తెలుగు సినిమా అని అన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇప్పుడు వారసుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ చూస్తే ఏ కోశాన కూడా ఇది తమిళ సినిమా అన్నట్టుగా లేదు. పక్కా రొటీన్ తెలుగు కమర్షియల్ సినిమాలానే ఉంది. ఓ ఇళ్లు.. ముగ్గురు కొడుకులు.. వారికి పెద్ద వ్యాపారం.. అందులో ఇద్దరు కొడుకులు (శ్యామ్, శ్రీకాంత్‌) వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక మూడో కొడుకు (విజయ్) కుటుంబానికి దూరంగా బయట ఉంటాడు.


వ్యాపారం అన్నాక శత్రువులుంటారు. ఇందులో జగపతి బాబు వారికి శత్రువు. తన ఫ్యామిలీకి కష్టాలు రావడంతో విజయ్ ఎంట్రీ ఇచ్చి శత్రువుల ఆట కట్టిస్తాడు. ఈ లైన్‌తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క ఫ్రేమ్, డైలాగ్‌ కూడా కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే రావడం లేదు. మరి ఈ రొటీన్ తెలుగు సినిమాను టాలీవుడ్, కోలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.


ఇక వారసుడు ట్రైలర్‌లో ఈ డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఇళ్లు అనేది ఇసుక, ఇటుక.. వదిలేసి వెళ్లిపోవచ్చు.. కానీ కుటుంబం అలా కాదు కదా?, పవర్ అనేది సీటులో ఉండదు.. అందులో వచ్చి కూర్చుంటాడో.. వాడిలో ఉంటుంది.. కుటుంబం అన్నాక లోపాలుంటాయి.. కానీ మనకు ఉన్నది ఒకే ఒక్క కుటుంబం అంటూ సాగిన డైలాగ్స్ అదిరిపోయాయి.
Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి