Shock to Gopichand Malineni: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. వారు చేస్తున్న సినిమా మాత్రమే కాకుండా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు కూడా లైనప్ సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. దీంతో తెలుగు దర్శకులకు తెలుగు హీరోలు దక్కక పోవడంతో వారు తమిళ సహా ఇతర భాషల హీరోల మీద కాన్సన్ ట్రేషన్ పెడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాబి, గోపీచంద్ మలినేని ఇప్పటి వరకు మరో సినిమా ఫైనల్ చేయలేదు. బాబి రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అదే విధంగా గోపీచంద్ మలినేని కూడా తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.


Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్


అయితే రజనీకాంత్ బాబీతో సినిమా ఫైనల్ చేయలేదు సరి కదా మరో ఇద్దరు తమిళ దర్శకులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో వినిపిస్తున్న ప్రచారాల మేరకు విజయ్ కూడా గోపీచంద్ మలినేని చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ మధ్యనే వంశీ పైడిపల్లి అనే తెలుగు దర్శకుడు వారసుడు సినిమాలో కనిపించిన విజయ్ గోపీచంద్ మలినేని చెప్పిన కథ ఆసక్తికరంగా లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టాడని, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాడని అంటున్నారు.


అయితే ఈ మధ్యనే ఆయన చేసిన కస్టడీ అనే తమిళ తెలుగు సినిమా భారీ బోల్తా పడింది. నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తాయని భావిస్తే డివైడ్ కారణంగా ఈ సినిమా బోల్తా పడే పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన చెప్పిన కథకు విజయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న ఏజీఎస్ అనే ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


Also Read: Kavya Thapar Photos: అసలు బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా కావ్య థాపర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి