Ormax Media Pan India Heros: ఒక్క పాన్ ఇండియా హిట్టు కూడా లేని విజయ్ కు మళ్లీ ఫస్ట్ ప్లేసా?
Thalapathy Vijay Stood First in Ormax Media Most popular male film stars in India: పాన్ ఇండియా టాప్ టెన్ హీరోల లిస్టులో హీరో విజయ్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఆ వివరాలు
Thalapathy Vijay Stood First in Ormax Media Most popular male film stars in India: ఒకప్పుడు ఒక హీరో సినిమా కేవలం ఆయన నటిస్తున్న భాష వరకే పరిమితమై ఉండేది. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల పరిధి పెరిగిన తర్వాత ఇతర భాషల హీరోల సినిమాలను తెలుగు, తమిళ, కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇలా పాన్ ఇండియా లెవెల్ లో బాహుబలి, పుష్ప, కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు సత్తా చాటాయి.
ఈ నేపథ్యంలోనే తమిళ, కన్నడ హీరోల సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఏ భాషకు సంబంధించి ఆ భాషలో టాప్ టెన్ హీరోల జాబితా ప్రతినెలా విడుదల చేస్తున్న ఆర్మాక్స్ మీడియా సంస్థ పాన్ ఇండియా లెవెల్ లో హీరోల జాబితాను కూడా విడుదల చేస్తోంది. ఆసక్తికరంగా ఆగస్టు నెల జాబితా కూడా ఇప్పుడు విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ హీరో విజయ్ ప్రథమ స్థానాన్ని సంపాదించగా మన హీరో ప్రభాస్ రెండో స్థానాన్ని సంపాదించాడు.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్ 3, 4, 5 స్థానాలను వరుసగా ఆక్రమించారు. ఆరో స్థానాన్ని అక్షయ్ కుమార్ దక్కించుకోగా ఏడవ స్థానాన్ని రామ్ చరణ్, ఎనిమిదవ స్థానాన్ని మహేష్ బాబు దక్కించుకున్నారు. ఇక తొమ్మిదవ స్థానాన్ని సూర్య దక్కించుకోగా పదవ స్థానాన్ని అజిత్ కుమార్ దక్కించుకున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో సరిగ్గా ఒక్క హిట్ కూడా లేని విజయ్ ప్రతి నెల మొదటి స్థానాన్ని ఎలా సంపాదిస్తున్నాడు అంటూ పలువురు ప్రశ్నిస్తుండగా ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలతో పాటు కేజీఎఫ్ వంటి సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ వీరిలో ఎవరో ఒకరు మొదటి స్థానాన్ని ఆక్రమించాల్సింది కానీ ప్రతి నెల విజయ్ మొదటి స్థానానికి వస్తున్నాడు అంటే ఇదేదో తేడాగా ఉందే అని కామెంట్లు చేస్తున్నారు.
అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కువగా ఏ హీరో గురించి చర్చ జరిగింది? అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆర్మాక్స్ మీడియా సంస్థ ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రతినెలా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం అనేది ఆసక్తికరంగా మారింది. ఫాన్స్ ఎన్ని కామెంట్లు చేసినా ఆర్మాక్స్ మీడియా సంస్థ మాత్రం ఈ జాబితాను విడుదల చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదనే చెప్పాలి.
Also Read: Facts About Chhello Show: చెల్లో షో ఆస్కార్స్‌కు ఎలా వెళ్లింది.. అసలు సినిమా కధ ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.