Vijay Varasudu Audio Rights : దళపతి విజయ్ సినిమాలకు కోలీవుడ్‌లో ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. యావరేజ్ టాక్‌తో కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోల్లో విజయ్ ఒకడు. ఇప్పుడు విజయ్ తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోన్నాడు. మొదటిసారిగా ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి సినిమాతో విజయ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారసుడు అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి భారీగా సెటప్ చేసినట్టు తెలుస్తోంది. భారీ క్యాస్టింగ్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను బృందావనం స్టైల్లో ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్‌ను దీపావళికి రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వచ్చింది. కానీ ఇంత వరకు అలాంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న ఆడియో రైట్స్ లెక్కలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి.


మామూలుగా ఆ మధ్య నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఆడియో రైట్స్ గురించి మాట్లాడాడు. తెలుగులో హయ్యస్ట్ ఆడియో రైట్స్ మహా అంటే దాదాపు ఐదు కోట్లుంటాయని చెప్పుకొచ్చాడు. గాడ్ ఫాదర్ ఆడియో రైట్స్ కూడా ఐదు కోట్లకే అమ్మినట్టున్నారని తనకు తెలిసింది చెప్పాడు. అలా మొత్తానికి ఐదు కోట్లు అనేది మ్యాగ్జిమమ్ అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయ్ వారసుడు ఆడియో రైట్స్ లెక్కలు వింటే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.


 



రెండు భాషలకు కలిసి ఈ రేంజ్‌లో తీసుకుని ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అందుకే వారసుడు ఆడియో రైట్స్‌ను పది కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ఇది విజయ్, తమన్ కెరీర్‌లో హయ్యస్ట్ డీల్ అని తెలుస్తోందట. అయితే పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయని టాక్. కోలీవుడ్‌లో ఈ రేంజ్‌లో ఆడియో రైట్స్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అంటూ టాక్ వినిపిస్తోంది. 


ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఎన్నో పోస్టర్లు, వీడియోలు నెట్టింట్లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్ నుంచి ఇలా స్టిల్స్ లీక్ అవుతుండటంతో దిల్ రాజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయినా కూడా లీక్స్ మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉందట.


Also Read : Ginna Day 2 Collections : రెండో రోజు లెక్కలివే.. 'సర్దార్' జోరు.. 'జిన్నా' బేజారు


Also Read : Mega 154 Title Teaser : ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్..కేకపుట్టించేలా చిరు స్టైల్.. పూనకాలు లోడింగ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook