Copy allegations on SS Thaman: ఎస్ఎస్ థమన్ టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల వైకుంఠపురములో సినిమాలో ( Ala vaikuntapuramlo movie ) అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో టాలీవుడ్‌లో అతని రేంజ్ ఇంకాస్త పెరిగిందని చెప్పవచ్చు. అల వైకుంఠపురములో సినిమాలోని ప్రతీ పాట బ్లాక్ బాస్టర్‌గా నిలవడమే అందుకు కారణం. అంతే కాకుండా యూట్యూబ్‌లో అతి తక్కువ సమయంలో కొన్ని మిలియన్ల వ్యూస్‌ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రాములో రాములా ( Ramulo ramula song ), బుట్ట బొమ్మ ( Butta bomma song ), సామజవరగమన ( Samajavaragamana song ) పాటలు వందల మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అల వైకుంఠపురములో సినిమానే కాకుండా, థమన్ కంపోజ్ చేసిన ప్రతీ ఆల్బమ్ సూపర్ హిట్టే. అటువంటి థమన్‌పై తాజాగా మరోసారి కాపీ క్యాట్ ఆరోపణలు వెల్లువెత్తాయి. Also read : V Movie: సుధీర్ బాబు ఫిట్‌నెస్‌పై ఇన్‌స్పైరింగ్ వీడియో


సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న థమన్‌పై కాపీ క్యాట్ ఆరోపణలు ( Copycat allegations ) ఇదేం కొత్త కాదు... గతంలోనూ థమన్ వేరే సినిమాల మ్యూజిక్‌ని కాపీ చేసాడు అనే అనే ఆరోపణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో, థమన్ ఆ పుకార్లను కొట్టిపారేశాడు. తాజాగా విడుదలైన V movieకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి భారీ స్పందన లభించినప్పటికి.. అదే సమయంలో రాట్సాసన్, సాహో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి సినిమాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని కాపీ చేశాడనేది తాజాగా థమన్‌పై వస్తోన్న ఆరోపణ. మరి ఈసారి థమన్ ( Thaman ) ఈ ఆరోపణలను ఎలా తిప్పి కొడతాడో వేచిచూడాల్సిందే మరి. Also read : F3 Movie: F3 మూవీ ఎక్కడివరకు వచ్చింది ? లేటెస్ట్ అప్‌డేట్స్..